జూబ్లీలో ఉప ఎన్నికలో.. కూటమి పోటీ?

Publish Date:Jul 4, 2025

Advertisement

 

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. నిజానికి, ఉప ఎన్నిక  ఎప్పుడు అనేది ఇంకా తేలలేదు. కానీ, నియోజక వర్గంలో ఎన్నికల సందడి మాత్రం అప్పుడే మొదలైంది. ప్రధానంగా, ఆధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌తో పాటుగా బీజేపీ కూడా  బరిలో దిగేందుకు రెడీ అవుతున్న నేపధ్యంలో సహజంగానే నియోజక వర్గం, అందరి దృష్టిని, మరీ ముఖ్యంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆదాల ఉంటే. జూబ్లీహిల్స్’ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పునుందా? రాజకీయ సమీకరణలను మార్చివేస్తుందా, కొత్త పొత్తులకు తెర తీస్తుందా,? రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందా? ఇలా అనేక కోణాల్లో, అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

దీన్ని బట్టి చూస్తే ఏమి జరిగిన ఏమి జరగక పోయినా,జూబ్లీ ఉప ఎన్నికరాజకీయ ఊహాలకు,వ్యూహాగానాలకు వేదిక అవుతుందనిపిస్తోందని అంటున్నారు.  నిజానికి ఇప్పటికే, అనేక ఉహాలు, వ్యూహాగానాలు సోషల్  మీడియా మొదలు మెయిన్’ స్ట్రీమ్’ మీడియా వరకు కథలు కథలుగా చక్కర్లు కొడుతన్నాయి. అయితే, ఈ ఉహాలను, వ్యూహాగానాలను పూర్తిగా కొట్టివేయడం కుదరదని,, రాజకీయ పండితులు అంటున్నారు. అవును,ఉప ఎన్నిక జరుగుతున్నది, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గం కాకుండా మరో నియోజక వర్గం అయితే, ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ, జూబ్లీ హిల్స్’  నియోజక వర్గానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత  దృష్టా, తెలంగాణలోనే కాకుండా,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ జూబ్లీ ఉప ఎన్నిక గురించిన చర్చ జరుగుతోంది. ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నియోజక వర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే,అందులో ఒకొంతు ఓటర్లకు కొంచెం అటూ ఇటుగా, ఆంధ్రా మూలాలున్న, సెట్ల్లెర్స్’ ఉన్నారు.అఫ్కోర్స్,అంతకంటే ఎక్కువగా, ఒక లక్షా 20 వేల వరకు ముస్లిం, మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అయినా జూబ్లీ నియోజక వర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించేది, సెట్లర్’ ఓటర్లే అంటారు.  

అదొకటి అయితే, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన, తెలంగాణ తొలి శాసన సభ ఎన్నికల్లోనూ జూబ్లీ నియోజక వర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన  మాగంటి గోపీనాథ్’ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్’లో చేరినా, వరసగా 2018, 2023 ఎన్నికల్లో ఆయన్ని గెలిపించింది మాత్రం సెట్లర్స్’ ఓట్లే అంటారు. ఈ నేపథ్యంలో, తెలంగాణలో రీ-ఎంట్రీకి ప్రయత్నిస్తునట్లు చెపుతున్న,తెలుగు దేశం పార్టీ, జూబ్లీ ఉప ఎన్నికను లాంచింగ్ ప్యాడ్’ చేసుకుంటుందని, పరిశీలకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి ఇప్పటికీ గట్టి పట్టుంది. రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 ఎన్నికల్లో,జనసేన మద్దతుతో పోటీచేసిన బీజేపీ, టీడీపీ కూటమి,20 అసెంబ్లీ స్థానాలు( టీడీపీ 15, బీజేపీ 5) గెలుచు కుంది. 2018లో కాంగ్రెస్’ జట్టుకట్టి పోటీచేసినా టీడీపీ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రం టీడీపీ తెలంగాణలో పోటీచేయలేదు. అయితే,ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో, టీడీపీ తెలంగాణలో తిరిగి కాలు మోపేందుకు సిద్డమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆంధ్ర ప్రదేశ్’ లో సక్సెస్ అయిన, టీడీపీ. జనసేన, బీజేపీ కూటమి ఫార్ములాను తెలంగాణాలో కొనసాగించాలని కూటమి నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జూబ్లీ ఉప ఎన్ని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేస్తుందని అంటున్నారు. అయితే, కూటమి తరపున, ఏపార్టీ పోటీ చేయాలి, అభ్యర్థి ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు.

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.