‘మహానటి’ మాధురి!
Publish Date:Aug 13, 2024
Advertisement
నటి సావిత్రి ఎప్పుడో పుట్టినందువల్లే ‘మహానటి’ ఆమె సొంతం అయిందిగానీ, దివ్వెల మాధురి అప్పట్లో పుట్టినా, సావిత్రి ఇప్పుడు పుట్టినా ‘మహానటి’ బిరుదు మాత్రం దివ్వెల మాధురి సొంతం అయ్యేది. అయినప్పటికీ, నేటితరం ‘మహానటి’ అని దివ్వెల మాధురిని పిలుచుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాస్‌తో ‘ఆయనకిద్దరు’ వ్యవహారం రోడ్డుమీద పడిన తర్వాత రకరకాల సందర్భాల్లో మాధురి ప్రదర్శించిన నటనా చాతుర్యాన్ని గమనిస్తున్నవారు ఆమెకు తప్పనిసరిగా ‘మహానటి’ బిరుదు ఇచ్చి తీరాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తారు. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో తన గుట్టు పూర్తిగా రట్టు కాగానే మాధురి మొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు.. ఆ ప్రెస్‌మీట్లో మాధురి ఇచ్చిన హావభావాలు ఏవైతే వున్నాయో, అన్నిటికీ తెగించిన తెలుగు వనితలా ఆమె వ్యవహార శైలి ఏదైతే వుందో అవి అదరహో. అక్రమసంబంధం ఆరోపణలు వచ్చిన ఏ మహిళా అంత ధైర్యంగా ‘అవును మాకు సంబంధం వుంది’ అని ప్రకటించడం నెవర్ బిఫోర్.... నెవర్ ఆఫ్టర్. ఆ తర్వాత పట్టు చీర కట్టుకుని, చక్కగా మేకప్ వేసుకుని మీడియా ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె ప్రదర్శించిన ఆత్మాభిమానం, తెగువ మామూలుగా లేవు. ఇక ఆత్మహత్య డ్రామాని రక్తికట్టించడం కోసం సేఫ్‌గా వుండే కారుతో తెలివిగా యాక్సిడెంట్ చేయడం, ఆ తర్వాత ఆస్పత్రిలో పూర్తిగా వాడిపోయిన ముఖంతో బెడ్ మీద పడుకుని, నేను బతకను.. ఆత్మహత్య చేసుకోవాలనే యాక్సిడెంట్ చేశాను.. అని విలపించడం. ఓ గంట తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, అసలేం జరగనట్టుగా చాలా ధైర్యంగా మాట్లాడుతూ, తన ‘ఆయనకిద్దరు’ వ్యవహారం మొత్తాన్నీ తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేయడానికి శతవిధాలా ప్రయత్నించడం... ఇవన్నీ క్లాప్స్ కొట్టించుకునే అభినయ ప్రతిభకి తార్కాణాలు. ఇక లేటెస్టుగా మాధురి మేడమ్ ఆస్పత్రి బెడ్ మీదే వుంటూ ఒక ఎమోషనల్ వీడియో తెలుగు జాతికి అందించింది. అందులో ఆమె చక్కగా మేకప్‌లో మెరిసిపోతూ చెయ్యి తిరిగిన రైటర్ రాసినట్టుగా వున్న ఎమోషనల్ డైలాగ్స్ మంచి ఎక్స్.ప్రెషన్‌తో చెబుతుంటే చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవనిపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో ఏమోగానీ, తెలుగు ప్రజలకు మరో ‘మహానటి’ దొరికింది.. అది చాలు!
http://www.teluguone.com/news/content/madhuri-emotional-25-182851.html





