సీఐడీ ఆరా..నేపాల్ లో భాను కిరణ్?
Publish Date:Jan 22, 2012
Advertisement
హైదరాబాద్: మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ అలియాస్ భాను నేపాల్‌లో ఉన్నట్లు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడ సాధువు వేషంలో తిరుగుతున్నట్లు అందిన సమాచారంతో ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి ఆరా తీస్తున్నారు. భాను కోసం మన దేశంలోని అనుమానిత ప్రాంతాలన్నింట్లో సీఐడీ బృందాలు గాలించినా ఫలితం లేకపోయింది. నోయిడా, ఢిల్లీలో దొరికినట్లే దొరికి చివరి క్షణంలో తప్పించుకుపోయినట్లు సీఐడీ అధికారులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత అతడు ఎక్కడున్నాడనే విషయంలో చిన్న క్లూ కూడా దర్యాప్తు అధికారులకు లభించడంలేదు. తాజాగా కఠ్మాండు పరిసరాల్లో భాను ఉన్నట్లు సమాచారం అందింది. బీహార్ మీదుగా అతడు నేపాల్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/maddelachervu-suri-24-11135.html





