Publish Date:May 15, 2026
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో ఆకాశ్ సింగ్ ) అదరగొట్టగా, బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్ కేవలం 38 బంతుల్లో 90 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి లక్నోసూపర్ జెయింట్స్ కు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించారు. లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో వేదికగా శుక్రవారం ( మే 15) జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆకాశ్ సింగ్ అద్భుత బౌలింగ్ తో కట్టడి చేశాడు. గైక్వాడ్, శాంసన్, ఉర్విల్ పటేల్‌లను పెవిలియన్‌కు పంపి చెన్నై టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. కష్టాల్లో పడిన జట్టును కార్తీక్ శర్మ 42 బంతుల్లో 71పరుగులు, డెవాల్డ్ బ్రెవిస్ పాతిక పరుగులతో ఆదుకున్నారు. చివరిలో చివర్లో శివమ్ దూబే 6 బంతుల్లో 32 నాటౌట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
188 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ 32 బంతుల్లో 36 తొలి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. 9 ఫోర్లు, 7 సిక్సర్లతో చెన్నై బౌలర్లను చీల్చి చెండాడాడు. సెంచరీకి కేవలం 10 పరుగుల దూరంలో దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. మార్ష్ నిష్క్రమణ తర్వాత నికోలస్ పూరన్ 17 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. లక్నోసూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lucknow-super-gaints-easy-win-over-chennai-36-219937.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.