రాజీవ్‌ను చంపడం తప్పే... ఎల్టీటీఈ నేత పశ్చాత్తాపం
Publish Date:Mar 11, 2016
Advertisement
‘భారత మాజీప్రధాని రాజీవ్‌గాంధీని పొట్టనపెట్టుకోవడం తాము చేసిన అతి పెద్ద తప్పు’ అని ఒకనాటి ఎల్టీటీఈ నేత బాలసింగం పేర్కొన్నారు. తను చనిపోయే ముందు ఈ విషయాన్ని నార్వే దౌత్యవేత్త ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. తాము రాజీవ్‌గాంధిని చంపిన విషయం ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ తొలుత అంగీకరించలేదని, కానీ తరువాత వారు ఒప్పుకోక తప్పలేదని చెప్పుకొచ్చారు బాలసింగం. అసలు రాజీవ్‌ను చంపాలన్న నిర్ణయం ప్రభాకరన్ ఎందుకు తీసుకున్నారో కూడా బాలసింగం వెల్లడించారు. 1987-90ల మధ్య కాలంలో రాజీవ్‌గాంధి శ్రీలంకలో శాంతిని స్థాపించేందుకు కొంత సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం చేతిలో చాలామంది ఎల్టీటీఈ తీవ్రవాదులు హతులైపోయారు. మళ్లీ రాజీవ్‌గాంధి కనుక ప్రధానమంత్రి పదవిని చేపడితే ఆనాటి సంఘటనలు పునరావృతం అవుతాయన్న భయంతో, ఆయనను పొట్టనపెట్టుకున్నామన్నది బాలసింగం మాట. ఈ విషయాలన్నీ కూడా మార్క్ సాల్టర్ అనే రచయిత తన ‘టు ఎండ్ ఏ సివిల్ వార్’ పుస్తకంలో పేర్కొన్నాడు. 549 పేజీల సుదీర్ఘమైన ఈ పుస్తకంలో శ్రీలంకలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన తమిళ-సింహళీయుల మధ్య పోరాటాన్ని, దానికి ముగింపు పలికేందుకు నార్వే నేతృత్వంలో సాగిన శాంతి ప్రక్రియ వివరాలనీ పొందుపరిచారు. రాజీవ్‌ను చంపాలన్న ఆలోచన తప్పని, అప్పుడే ఎల్టీటీఈ నేతల మనసుకి తట్టి ఉంటే ఎంత బాగుండేదో!
http://www.teluguone.com/news/content/ltte-leader-velupillai-prabhakaran-39-56820.html





