దిగి వచ్చిన ఎల్పీజీ గ్యాస్ ధరలు
Publish Date:Jun 30, 2026
Advertisement
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు దిగివచ్చాయి. 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తగ్గిన ధరలు బుధవారం (జులై 1) నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడమే ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణం. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని 60 రోజుల పాటు పొడిగించడంతో చమురు ధరలు దిగివచ్చాయి. దీంతో పాటు ప్రపంచంలోని 20 శాతం చమురు రవాణా జరిగే హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఒత్తిడి తగ్గడంతో ధరలు దిగివచ్చాయి. అయితే గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలెండర్ ధర మాత్రం ఎలాంటి మార్పూ లేకుండా యధాతథంగా ఉంది.
http://www.teluguone.com/news/content/lpg-gas-price-comes-down-36-224702.html





