వంట గ్యాస్ వాడేవారికి బిగ్ షాక్.. సిలిండర్‌పై రూ. 18 సెస్?

Publish Date:Aug 6, 2026

Advertisement

దేశంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇంధన ధరల భారం నిత్యం ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో భారీ భారం పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గృహావసరాలకు వాడే వంట గ్యాస్ (ఎల్పీజీ) తో పాటు సహజ వాయువు (నేచురల్ గ్యాస్) వినియోగదారులపై ప్రత్యేకంగా సెస్ విదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తోంది. జాతీయ స్థాయిలో ఇంధన భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా ఎల్పీజీ సిలిండర్ ధర మరింత ప్రియం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనల ప్రకారం, ఎల్పీజీ పై కిలోకు రూ. 1.29 చొప్పున సెస్ విధించాలని యోచిస్తున్నారు. ఈ లెక్కన మనం సాధారణంగా గృహావసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై నేరుగా సుమారు రూ. 18 దాకా అదనపు భారం పడనుంది. అలాగే పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) మరియు సీఎన్‌జీ వినియోగదారులకు కూడా ఈ సెస్‌ భారం తప్పదు. నేచురల్ గ్యాస్‌పై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ. 1.43 చొప్పున సెస్ విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ సెస్ వసూలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు రూ. 14,000 కోట్ల భారీ రాబడి సమకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అసలు కేంద్ర ప్రభుత్వం ఉన్నపళంగా ఈ సెస్ విధించడానికి ప్రధాన కారణం ఏమిటనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. ఇటీవల అమెరికా మరియు ఇరాన్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ అంతర్జాతీయ పరిణామాల వల్ల భారత్‌లో కూడా ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి, దేశీయంగా గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తింది. మన దేశం అత్యధికంగా విదేశీ ఇంధన దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా యుద్ధాలు వస్తే దేశంలో ఇంధన సంక్షోభం రాకుండా నివారించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం.

gas cylinder price hike cess news,center plan cess on lpg natural gas.
 

By
en-us Political News

  
ప్రభుత్వ పాఠశాలలో విషసర్పం కాటుకు ఎనిమిదేళ్ల విద్యార్థి బలి..!
హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా మరో కీలక అడుగు వేస్తోంది
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ బతికున్న సమయంలో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్‌ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.