వంట గ్యాస్ వాడేవారికి బిగ్ షాక్.. సిలిండర్‌పై రూ. 18 సెస్?
Publish Date:Aug 6, 2026
Advertisement
దేశంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇంధన ధరల భారం నిత్యం ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో భారీ భారం పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గృహావసరాలకు వాడే వంట గ్యాస్ (ఎల్పీజీ) తో పాటు సహజ వాయువు (నేచురల్ గ్యాస్) వినియోగదారులపై ప్రత్యేకంగా సెస్ విదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తోంది. జాతీయ స్థాయిలో ఇంధన భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా ఎల్పీజీ సిలిండర్ ధర మరింత ప్రియం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనల ప్రకారం, ఎల్పీజీ పై కిలోకు రూ. 1.29 చొప్పున సెస్ విధించాలని యోచిస్తున్నారు. ఈ లెక్కన మనం సాధారణంగా గృహావసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై నేరుగా సుమారు రూ. 18 దాకా అదనపు భారం పడనుంది. అలాగే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) మరియు సీఎన్జీ వినియోగదారులకు కూడా ఈ సెస్ భారం తప్పదు. నేచురల్ గ్యాస్‌పై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ. 1.43 చొప్పున సెస్ విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ సెస్ వసూలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు రూ. 14,000 కోట్ల భారీ రాబడి సమకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం ఉన్నపళంగా ఈ సెస్ విధించడానికి ప్రధాన కారణం ఏమిటనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. ఇటీవల అమెరికా మరియు ఇరాన్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ అంతర్జాతీయ పరిణామాల వల్ల భారత్‌లో కూడా ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి, దేశీయంగా గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తింది. మన దేశం అత్యధికంగా విదేశీ ఇంధన దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా యుద్ధాలు వస్తే దేశంలో ఇంధన సంక్షోభం రాకుండా నివారించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం. gas cylinder price hike cess news,center plan cess on lpg natural gas.
http://www.teluguone.com/news/content/lpg-cooking-gas-cess-proposal-india-36-228163.html





