ఎస్ క్యూబ్(S³).. లోకేష్ సక్సెస్ ఫార్ములా!

Publish Date:Jun 23, 2026

Advertisement

జాతీయ రాజకీయ యవనికపై  ఏపీ మంత్రి మంత్రి నారా లోకేష్ తనదైన ముద్ర వేశారు. వేస్తున్నారు.  రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ 'నేషన్ ఫస్ట్' అనే  థీమ్‌తో హస్తిన వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ సదస్సులో   షేపింగ్ పవర్ గా ఇండియా  అనే  ప్యానెల్ చర్చలో  పాల్గొన్న నారా లోకేష్ ప్రపంచలొ ఇండియాను అగ్రస్థాయి ఆర్థిక శక్తిగా నిలపాలనే ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురు విజన్‌కు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తోడ్పడుతోందో కళ్లకు కట్టారు. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న S³.. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఫార్ములాను ఆయన ఈ వేదికపై  ప్రకటించారు.

ఈ సదస్సులో జాతీయ మీడియా ప్రతినిధులు సంధించిన  క్లిష్టమైన ప్రశ్నలను  లోకేష్  తనదైన శైలిలో ఎదుర్కొని పరిణితితో సమాధానాలు ఇచ్చారు.   కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది ఎంపీల బలం ఉండటం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు దక్కుతున్నాయా?  అన్న ప్రశ్నకు ఆయన.. కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే..  ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

ఈ విషయానికి సంబంధించి లోకేష్ ఇచ్చిన ఉదాహరణకు ప్యానెల్ సభ్యులు సైతం ఫిదా అయ్యారు.   కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వస్తోందని సమాచారం అందగానే, మిగతా రాష్ట్రాలు ఇంకా ఆ దిశగా ఆలోచించకముందే ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా స్పందించిందన్న లోకేష్..  ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, కేవలం 37 రోజుల్లోనే ఏకంగా 600 ఎకరాల భూమిని ఆ ప్రాజెక్ట్ కోసం కేటాయించామనీ. . ఈ స్థాయి వేగం వల్లే రక్షణ శాఖ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సొంతమైందన్నారు. ఇ ఈ వేగం కేవలం ఏపీ వృద్ధికే కాకుండా, చైనాకు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సప్లై చైన్‌లో భారతదేశాన్ని నిలబెట్టడానికి ఎంతో అవసరమని  ఉద్ఘాటించారు.

ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక డిజిటల్ సంస్కరణల గురించి లోకేష్ మాట్లాడినప్పుడు సదస్సులోని వారంతా సంభ్రమాశ్చర్యాలో అభినందనలు కురిపించారు. . కార్పొరేట్ సంస్థల నిర్వహణ తరహాలోనే తాము ప్రభుత్వ స్కూళ్లలో టెక్నాలజీని వాడుతున్నామన్న లోకేష్..   తాను అమరావతిలోని తన ఛాంబర్‌లో కూర్చొని డిజిటల్ స్క్రీన్ల ద్వారా రాష్ట్రంలోని ఏ స్కూల్‌లో ఏ టీచర్‌కు, ఏ విద్యార్థికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో రియల్ టైమ్‌లో పర్యవేక్షించగలనన్నారు. ఈవిధానాల వల్లే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న లోకేష్.. ఇటీవలి కాలంలో ఏకంగా 85 వేల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను వదిలి ప్రభుత్వ స్కూళ్లలో చేరడం ఒక చారిత్రాత్మక రికార్డు అని  వెల్లడించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యమైన విద్యను, డిజిటల్ మౌలిక వసతులను తాము అందిస్తున్నామని చెప్పారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన రాజధాని అమరావతి నిర్మాణ కాలపరిమితిపై జాతీయ వేదిక నుంచి లోకేష్  క్లారిటీ ఇచ్చారు.  2028 సంవత్సరానికల్లా అమరావతిలో ప్రధాన ప్రభుత్వ భవనాలన్నింటినీ ప్రారంభించి తీరుతామన్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిని కేవలం ఒక పరిపాలనా నగరంగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక తిరుగులేని ఎకనామిక్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారుజ జాతీయ స్థాయిలో లోకేష్ ప్రదర్శించిన   ప్రసంగ పటిమ, స్పష్టమైన రోడ్‌మ్యాప్ భవిష్యత్ జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్రను పోషించబోతున్నారన్న బలమైన సంకేతాలను ఇచ్చింది.

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.