రెడ్‌బుక్‌ చాప్టర్3లో ముగ్గురి పేర్లు.. కొడాలి నాని, వల్లభనేని వంశి.. మూడో వ్యక్తి ఎవరు?

Publish Date:Nov 2, 2024

Advertisement

రెడ్‌బుక్‌.. ఈ పేరు వింటేనే. మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది.  మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లా స్థాయి వైసీపీ నేతల వరకు అందరిలోనూ ఎప్పుడు ఎవరు జైలు కెళ్లాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. వైసీపీ ఐదేళ్ల హయాంలో నిబంధనలు తుంగలో తొక్కి కొందరు అధికారులు, వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు పలువురిని జైళ్లకు పంపించి చిత్రహింసలకు గురిచేశారు. కొందరు వైసీపీ నేతలు ఏకంగా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైనా దాడులు చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలో తెలుగుదేశం శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరించిన వైసీపీ నేతలు, వారికి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల పేర్లను ప్రతిపక్షంలోఉన్న సమయంలో నారా లోకేశ్ ‘రెడ్‌బుక్‌’లో నమోదు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని వదిలిపెట్టేది లేదని, ఒక్కొక్కరిని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే, అప్పట్లో వైసీపీ నేతలు రెడ్‌బుక్‌పై వెటకారంగా మాట్లాడారు. కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్‌ పేరు వింటేనే వైసీపీ భయంతో వణికి పోతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే లోకేశ్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేశారు. రెడ్‌బుక్‌లో నమోదు చేసుకున్న పేర్ల ప్రకారం ఒక్కొక్కరికి చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోనే రెడ్‌బుక్‌ ప్రభావం కనిపించడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఢిల్లీకివెళ్లి ఆందోళనకు దిగారు. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ స్వయంగా జగన్ గగ్గోలు పెట్టాడు.  అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ ‘రెడ్‌బుక్‌’ అంటుంటే నవ్వుకున్న జగన్.. అధికారం కోల్పోయిన తరువాత రెడ్‌బుక్‌ అంటేనే వణికిపోతున్న పరిస్థితి. అప్పట్లో తెలుగుదేశం శ్రేణులను టార్గెట్ చేసి వేధించిన వారిలో చాలా మందిపై ఇప్పటికే రెడ్‌బుక్‌ ఛాప్టర్1, ఛాప్టర్2 ఓపెన్ చేసి చట్టపరంగా కేసులు నమోదు చేశారు. ఛాప్టర్1లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించి టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదుచేసి జైళ్లకు పంపించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులపై విచారణలు జరుగుతుండగా.. కొందరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. మరి కొందరిని సస్పెండ్ చేశారు. రెడ్‌బుక్‌ ఛాప్టర్2లో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు మొదలు పెట్టారు. అదే విధంగా అధికార మదంతో చంద్రబాబు, పవన్, లోకేశ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు జైలు కెళ్లగా.. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు లోకేశ్   తాజాగా‘రెడ్‌బుక్‌’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రెడ్‌బుక్‌లో చాప్టర్ 3 ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఛాప్టర్3లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే విషయంపై వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

మంత్రి నారా లోకేశ్ వారం రోజులు అమెరికాలో పర్యటించారు. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పలు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.    రెండు రోజుల కిందట అమెరికాలోని అట్లాస్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నారా లోకేశ్ మాట్లాడుతూ రెడ్‌బుక్‌ గురించి ప్రస్తావించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తన యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇందుకోసం త్వరలో రెడ్‌బుక్‌ ఛాప్టర్3 ఓపెన్ చేస్తామని ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని అన్నారు. అయితే, రెడ్‌బుక్‌ ఛాప్టర్3 ఓపెన్ కావాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్ట పడాలని లోకేశ్ సూచించారు. దీంతో ఛాప్టర్3లో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఉండబోతున్నాయని లోకేశ్ చెప్పకనే చెప్పారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలు నందమూరి, చంద్రబాబు కుటుంబాలపై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణిని అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వంశీపై తెలుగుదేశం శ్రేణులే కాదు,   ప్రజలు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవైపు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్దం కేసులో వంశీపై కేసు నమోదైంది. త్వరలో వంశీపై అంతకన్నా తీవ్రమైన కేసులు నమోదు కాబోతున్నాయని, జైలుకు వెళ్లడం ఖాయమని లోకేష్ చెప్పకనే చెప్పారంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 

రెడ్‌బుక్‌ ఛాప్టర్3లో కొడాలి నాని పేరుకూడా ఉంటుందని లోకేశ్ హింట్ ఇచ్చేశారు. వైసీపీ హయాంలో కొడాలి నాని ఇష్టానుసారంగా రెచ్చిపోయిన విషయం తెలిసిందే. నందమూరి, నారా కుటుంబాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. చంద్రబాబును ఏకవచనంతో అసభ్య పదజాలంతో దూషించాడు. పవన్ కల్యాణ్, లోకేష్ పైనా అనేక సార్లు నోరుపారేసుకున్నాడు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండాలి నాని, వల్లభనేని వంశీలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛాప్టర్ -3లో నాని, వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు లోకేశ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

వీరిద్దరితో పాటు మరో వైసీపీ ముఖ్యనేత పేరుకూడా రెడ్‌బుక్‌ ఛాప్టర్3లో ఉందని ప్రచారం జరుగుతుంది. అతను జగన్ మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరి వ్యక్తి అని, అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా.. త్వరలో మరో కేసు నమోదు కాబోతుందని, ఆ కేసులో సదరు వ్యక్తి జైలు కెళ్లడం ఖాయమని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రెడ్ బుక్ ఛాప్టర్ -3 అనగానే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందట. మొత్తానికి రెడ్ బుక్ అంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఎగతాళిగా మాట్లాడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరు వింటే వణికిపోతున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా లోకేశ్ రెడ్ బుక్ పేరు ప్రస్తావించడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

By
en-us Political News

  
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.