ఢిల్లీకి లోకేశ్

Publish Date:Sep 14, 2023

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులను జాతీయ స్థాయిలో లోకేశ్ వివరించనున్నారు. అలాగే చంద్రబాబు కేసు అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఆయన చర్చించనున్నారు. అదీకాక రాష్ట్ర పరిస్థితులు, కక్ష సాధింపు రాజకీయాలపై పార్లమెంట్ల్‌లో చర్చించేలా టీడీపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ ఎంపీలో లోకేశ్ మాట్లాడనున్నారని సమాచారం. 

మరోవైపు చంద్రబాబునాయుడి అరెస్ట్ అక్రమమని.. ఈ విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో.. స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయకక్షోనే అరెస్టు చేశారని వివిధ పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజీ ఇస్తోంది. దీంతో ఈ అంశంపై మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలని లోకేశ్ నిర్ణయించిన్నట్లు సమాచారం.  

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి.. బాధితులపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినన్ని అరాచకాలు దేశంలో మరెక్కడా జరిగి ఉండవని.. వాటన్నింటినీ మీడియాకు వివరించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి.. తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని సోదాహరణగా చూపిస్తూ.... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని.. దీనిపై జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని నారా లోకేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.   

అలాగే అదే సమయంలో.. ఏ మాత్రం ఆధారాలు లేని కేసుల్ని ప్రతిపక్ష నేతలపై ఎలా అధికార ఫ్యాన్ పార్టీ బలవంతంగా రుద్దుతుందో కూడా ఈ సందర్భంగా వివరించనున్నట్లు తెలుస్తోంది. వ్యాపార సంస్థలపై ప్రభుత్వం జరిపిన దాడులు..  మార్గదర్శి, అమరరాజా వంటి సంస్థలపై జరిగిన దాడుల గురించీ వివరించి.. రాష్ట్రంలో అరాచక పాలన గురించి నారా లోకేశ్ వివరిస్తారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసిన వైనాన్ని వివరించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 73 ఏళ్ల  చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్‌లో లేకుండా... రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోకుండా..  కనీసం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు కుదిరితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా లోకేశ్ కలిసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఏపీలో పరిస్థితుల్ని ఢిల్లీ వేదికగా అందరి ముందు ఉంచాలని నారా లోకేష్ బలంగా నిర్ణయం తీసుకున్నారని.. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ హస్తిన వెళ్లినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.