లక్ష్య సాధన దిశగా లోకేష్ అడుగులు

Publish Date:Jul 12, 2023

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకొంది. ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం (జులై 11)  ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లిలో 2 వేల కిలోమీటర్లు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి నారా లోకేశ్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  

అలా ప్రారంభమైన ఆయన పాదయాత్ర .. కేవలం 153 మూడు రోజల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకొన్న సందర్బంగా కొత్తపల్లిలో నారా లోకేశ్  పైలాన్‌ను ఆవిష్కరించారు. మరోవైపు లోకేశ్ పాదయాత్ర.. అప్రతిహతంగా సాగుతోండడం పట్ల.. టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

లోకేశ్ చేపట్టిన పాదయాత్ర రాయలసీమలో ప్రారంభమై.. 53 నియోజకవర్గాల్లోని 135 మండలాల మీదగా వందలాది గ్రామాల్లో నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. అయితే ఈ పాదయాత్రలో నారా లోకేశ్ .. 30 లక్షల మందిని నేరుగా కలవగా.. వివిధ వర్గాల ప్రజల నుంచి వేలాది వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. 
 
ఇంకోవైపు ప్రతీ 100 కిలోమీటర్లకు ఆయన ఓ హామీ ఇస్తున్నారు. అందులో భాగంగా శిలాఫలకాలను  ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్బంగా కొత్తపల్లిలో పిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలన్నీ తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేస్తామని ప్రజల్లో నారా లోకేశ్ భరోసా కల్పిస్తున్నారు.   

ఇక నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. అప్రతిహతంగా కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి దాదాపు ఎక్కడా విరామం లేకుండా సాగుతోంది. అయితే అత్యవసరం అయితే తప్ప.. అంటే.. నందమూరి తారకరత్న మరణించిన సమయంలో.. ఆయన బౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ఒక సారి.. అలాగే ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తరాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరిగిన పసుపు పార్టీ పండగ మహానాడు సందర్బంగా మాత్రమే.. నారా లోకేశ్ తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన విషయం విదితమే. 
 
అధికార జగన్ పార్టీ, పోలీసులు కలిసి ఆంక్షలు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా.. నారా లోకేశ్ మాత్రం తనదైన శైలీలో.. తాను అనుకున్న లక్ష్యం దిశగా వడి వడిగా అడుగులు వేసుకొంటూ ముందుకు వెళ్తున్నారు. లోకేశ్ చేపట్టిన ఈ పాదయాత్రను నాలుగు వందల రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది. అంటే నారా లోకేశ్ సగం లక్ష్యాన్ని పూర్తి చేసుకొని.. ఆయన అడుగులు లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ నారా లోకేశ్.

By
en-us Political News

  
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.