Publish Date:Mar 25, 2025
చెప్పకుండా వచ్చినందుకు షాక్ ఇచ్చిన లోకేష్
అత్యంత హేయంగా, నీచంగా, ద్వేష భావంతో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల రవీంద్రరెడ్డి నేడు నారా లోకేష్ ముందు ప్రత్యక్షమై ఒక బిజినెస్ మీటింగ్ చేశారు. అయితే రవీంద్రారెడ్డి అని లోకేష్ కి తెలియకపోవచ్చు. కానీ ఆలస్యంగా విషయం తెలుసుకున్న లోకేష్ మందలో వచ్చి తనకు ఝలక్ ఇచ్చిన రవీంద్రకు అంతే వేగంగా షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు.
వ్యాపార సమావేశం నిమిత్తం మంగళవారం (మార్చి 25) సిస్కో కంపెనీ ప్రతినిథులు కొందరు మంత్రి నారా లోకేష్ ని కలిశారు. అదే కంపెనీలో సౌత్ ఇండియా టెరిటరీ ఎక్కౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల కూడా ఆ బృందంలో ఒక సభ్యుడిగా హాజరయ్యారు. ఈ విషయం గమనించని లోకేష్ అతడిని కంపెనీ సభ్యుడిగానే భావించారు. మాట్లాడి పంపించారు. ఇది గమనించి సోషల్ మీడియా హైలైట్ చేయడంతో షాక్ అయిన లోకేష్ వెంటనే ‘సిస్కో’ కపెనీకి ఆప్పాలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ విధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీభాగస్వామిని చేయవద్దని లేఖ రాశారు. ఆ విధంగా లోకేష్ ప్రతి స్పందించారు. లోకేష్ సిబ్బందికి, అధికారులకు అతను ఎవరో తెలియక పోవచ్చు కానీ, మంత్రి లోకేష్ వద్దకు ఏదైనా క ంపెనీ ప్రతినిథుల బృందాన్ని పంపేటప్పుడు వారెవరో తెలుసోవడంలో సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విఫలమైందని తెలుగుదేశం అభిమానులు విమర్శిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-shock-to-ycp-social-media-activist-ippala-ravindra-reddy-25-194989.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు