Publish Date:Sep 19, 2024
లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంత బాధ్యతగా పని చేశారో.. ఇప్పుడు అధికారం వచ్చిన తరువాత, మంత్రిగా అంతే బాధ్యతతో పని చేస్తున్నారు. ఇచ్చిన మాట నెరవేర్చడానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. హామీలను నెరవేర్చేదిశగా ఒక్కో అడుగూ వేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను, ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి, వారి నుంచి స్వయంగా విని తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన పలు హామీలను ఇచ్చారు. వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు అమలు చేస్తున్నారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడతాననీ, చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాననీ నారా లోకేష్ పాదయాత్ర సమయంలోనే ప్రజలలో నమ్మకం కలిగించారు. తన పాదయాత్ర సందర్భంగా ప్రతి వంద కిలోమీటర్లకూ ఒక శిలాఫలకం వేసి, దానిపై అప్పటి వరకూ తాను ఇచ్చిన హామీలను వాటిపై పొందుపరిచారు.
అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేరుస్తానని గట్టిగా చెప్పారు. అందులో భాగంగానే బంగారుపాల్యం లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి కాకుండానే డయాలసిస్ సెంటర్ హామీని నెరవేర్చిన నారా లోకేష్.. తాజాగా మాజీ సైనికులకు ఇఛ్చిన హామీని నెరవేర్చారు. మాజీ సైనికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాదయాత్ర సందర్భంగా తాను శిలాఫలకం వేసి మరీ ఇచ్చిన ప్రతి హమీనీ ఏడాది కాలవ్యవధిలో నెరవేరుస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని లోకేష్ చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-progress-in-fullfilling-promises-25-185102.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.