జనం..ప్రభం‘జనం’..లోకేష్ పాదయాత్ర@100 డేస్

Publish Date:May 14, 2023

Advertisement

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌  యువగళం  పాదయాత్ర సోమవారం నాటికరి ( మే 15)కి వంద రోజుల ల్యాండ్ మార్క్ కు చేరుకుంది.  కుప్పం నుంచి ప్రారంభించిన ఆయన పాదయాత్ర  ఒకటి రెండు రోజులు కాదు, వందో ..రెండొందల కిలోమీటర్లో కాదు. ఏకంగా  4 వేల కిలోమీటర్ల,400 రోజులు..అంటే 15 నెలలకు పైగా సాగే సుదీర్ఘ పాద యాత్రకు వంద రోజులకు చేరుకుంది. మరో మూడోందల రోజులు కూడా సాగుతుంది. వాస్తవానికి  ఆయన ఇంత  కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అధికారం కోసమా? అంటే, కాదనలేము. కానీ, అది పాక్షిక సత్యం మాత్రమే. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పట్టభిషిక్తుదయ్యాడు, కానీ, రావణ సంహారం జరిగింది మాత్రం రామచంద్రుని పట్టాభిషేకం కోసం కాదు, రాక్షస పాలన అంతమొందించేందుకే. ఇక ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు ప్రత్యేకించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కదా.  

రావణాసురుడు మాయలేడి వేషంలో సీతమ్మోరిని అపహరిస్తే, ఆధునిక (మోడరన్) రావణుడు  ఒక్క ఛాన్స్ పేరు చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. అందుకే మోడరన్ రావణాసుల పాలన అంతమొందించాలన్న సంకల్పంతో  లోకేష్,  యువగళం  పాదయాత్ర చేస్తున్నారని చెప్పవచ్చు.  ఇక లోకేష్ పాదయాత్ర ఏ విధంగా జరుగుతోంది. ఆయన యాత్ర పొడుగునా ఎన్నెని అవరోధాలను ఎదుర్కొంటున్నారు.  అనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకు జీవో ..01 తెచ్చింది. పాదయాత్రకు అనుమతి నిరాకరించింది. అయినా, కోర్టు అనుమతితో లోకేష్ ముందడుగు వేశారు. ఆయన మైక్ లాగేసుకున్నారు. జనాలను ఆయన పాదయాత్రలో అడుగు కలపకుండా ఎన్ని చేయాలో అన్నీ చేసింది జగన్ ప్రభుత్వం.అన్నిటినీ అధిగమించి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ముందడుగు వేశారు. పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

రోజులు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం తన శక్తియుక్తులన్నీ ఒడ్డి ఆయన యాత్రకు అవరోధాలు కల్పిస్తునే ఉంది. అయితే పులి కడుపున పుట్టిన పులి బిడ్డ లోకేష్ మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగుతున్నారు..  లోకేష్ కు తన ముందుంది సీదాసాదా మార్గం కాదని పాదయాత్ర ప్రారంభించడానికి ముందే తెలుసు.   ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు, గత  మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చూసి,అనుభవిస్తున్న అందరికీ  లోకేష్ మహాసాహసం చేస్తున్నారన్న విషయం తెలుసు.  అయినా, ఆనాడు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తాత నందమూరి తారక రామా రావు, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తండ్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన చైతన్య యాత్రల స్పూర్తితో ..   లోకేష్ తన పాదయాత్ర సాగిస్తున్నారు. ఆయన పాదయాత్ర సాగుతున్న కొద్దీ ప్రజాభిమానం చెలియలకట్ట తెంచుకుని మరీ ఉప్పెనలా ఉప్పొంగుతోంది.  ప్రజల దీవెనలతో దిగ్విజయంగా సాగుతోంది.  లోకేష్ విజయయాత్ర పై ఎవరికీ ఎలాంటి అనుమనాలు లేవు. ధర్మో రక్షిత రక్షితః .. ధర్మకోసం చేసే ధర్మ పోరాటం ఆదిలో అవరోధాలు ఎదుర్కున్నా అంతిమ విజయం సాధించి తీరుతుంది.

 అడుగడునా కష్టాలు తప్పవని తెలిసీ కన్నకొడుకును యుద్ద భూమికి పపండం ఏ తల్లికైనా ఎంత కష్టమో, ఏ తండ్రికైనా ఎంత బాధాకరమో వేరే చెప్పనకరలేదు. అందునా పాదయాత్ర కష్ట సుఖాలు స్వయంగా అనుభవించిన చంద్రబాబు నాయుడికి, ఆయన కష్టాలు చూసి మానసిక వ్యధను అనుభవించిన లోకేష్  మాతృ మూర్తి భువనేశ్వరికి కన్న కొడుకును పాదయాత్రకు ఆశ్వీదరించి సాగనంపడం ఎంతగా బాధించి ఉంటుందో వేర్తే చెప్పనక్కర లేదు. అయినా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ దుఃఖాన్ని దిగమింగుకుని, లోకేష్ ఆశ్వీదరించి అక్షింతలు వేసి సాగనంపారు. చంద్రబాబు దంపతులు.  అలాగే, లోకేష్ శ్రీమతి బ్రాహ్మణి, నిండా పట్టుమని పదేళ్ళు అయినా లేని కుమారుడు దేవాన్ష్‌ను, కుటుంబాన్ని వదిలి  400 రోజులు   దూరంగా ఉండడం లోకేష్ కు ఎంత కష్టమో బ్రాహ్మణి, దేవాన్ష్ కు అంతకు మించిన బాధ. అయినా రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం లోకేష్ సుదీర్గ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.  

ధర్మ రక్షణ కోసం కష్టాలను లెక్క చేయకుండా కదిలిన  లోకేష్ కు ప్రజా దీవేనలే శ్రీరామ రక్ష. ప్రజాభిమానమే కొండంత అండ. ఇక ఆయన అకుంఠిత దీక్షతో పాదయాత్ర కొనసాగిస్తున్న తీరు చూస్తే.. ఔరా అనిపించకమానదు. ప్రతి రోజూ.. తెల్లవారు జామున మొదలు పెట్టి  రాత్రి పదకొండు గంటల వరకూ అలుపెరుగని శ్రమ. గంట పాటు సెల్ఫీలు, ప్రతీ చోటా సమస్యలు తెలుసుకోవడం. భరోసా ఇవ్వడం. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎక్కడికక్కడ నాయకులతో సమాలోచనలు . వంద రోజులుగా  లోకేష్ దినచర్య ఇదే.    ఆయన పాదయాత్రలో జనాల్లేరని చెప్పడానికి వైసీపీ పడిన తాపత్రేయం అపహాస్యం పాలైంది.   ఆయన ప్రసంగంలో  ఎక్కడైనా మాట తడబడితే దాన్ని ఆధారం చేసుకుని ట్రోల్ చేసేందుకు అలా వైసీపీ సోషల్ మీడియాడేగ కన్నుతో ఎదురు చూస్తూనే ఉంది.    లోకేష్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని అవసవ్య మాటలు మాట్లాడిందో అందరికీ తెలుసు.  చివరికి బాడీ షేమింగ్ కు సైతం పాల్పడ్డారు.

 అలా రాజకీయాల్లోకి అసలు ఎంట్రీ ఇవ్వకుండానే టార్గెట్ అయిన నేత లోకేష్ ఒక్కరే.  అన్నిటినీ అధిగమించి ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రతి అడుగులోనూ ఆయన ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  అడుగడుగునా ప్రజలతో మమేమౌతూ అడుగులేస్తున్నారు.  ఈ వంద రోజుల నడకలో లోకేష్ ముఖంలో అలసట, విసుగు అన్నవే కనిపించలేదు. ప్రజలు చెప్పుకుంటున్న సమస్యలను శ్రద్ధగా వినడం, పరిష్కార మార్గాలు చెప్పడం, అడిగిన వారందరితో సెల్ఫీలు తీసుకుంటూ, జనమే లోకేష్.. లోకేషే జనం అన్నట్లుగా యువగళం పాదయాత్ర సాగుతోంది.  వంద రోజుల్లో లోకేష్ మూడు జిల్లాల్లో  పాదయాత్ర చేశారు.

 39 నియోజకవర్గాలను కవర్ చేశారు.ఆయన కవర్ చేసిన జిల్లాలన్నీ రాయలసీమ ప్రాంతానివే. మరో మూడు వందల రోజుల పాటు  శ్రీకాకుళం జిల్లా వరకూ పాదయాత్ర సాగుతుంది.  రాయలసీమలోనే ఇంత జన ప్రభంజనం ఉంటే ఇక కోస్తాకు వచ్చే సరికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో సులభంగా ఊహించుకోవచ్చు.    లోకేష్ పాదయాత్ర వందో రోజుకు చేరుకున్న సందర్భంగా కుమారుడిని ఆశీర్వదించేందుకు తల్లి భువనేశ్వరి రావడం కొసమెరుపు. మదర్స్ డే రోజున అంటే ఆదివారం భువనేశ్వరి నారా లోకేష్ క్యాంపు సైట్ వద్దకు వచ్చి ఆశీర్వదించారు. వందో రోజు పాదయాత్రలో తనయుడితో అడుగు కలిపి నడిచారు. 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.