కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. మనం అందరం ఆ వ్యవస్థలో భాగం. మీ పనితీరు వల్లే ఇక్కడ వరకు రాగలిగారు. రేపు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పక్కన కూర్చొంటారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని గుర్తించాలి. పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడుతున్నా. కార్యకర్తే అధినేత. గ్రామ పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇంఛార్జ్ పొలిట్ బ్యూరో వరకు రాగలగాలి.
ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. మనం కోరుకున్న మార్పు సాధ్యం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీ భవిష్యత్ దృష్ట్యా కడప మహానాడులో తీర్మానించిన 6 శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ సిద్ధాంతాలను వివరించేందుకు 365 రోజులూ శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. 2019-24 మధ్య జగన్ రెడ్డి ఎమ్మెల్యేలనే కలవలేదు. మనం కార్యకర్తలను కలుస్తున్నాం. నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం. వారానికోరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నామని లోకేష్ తెలిపారు .
పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కోసం చట్ట సవరణ చేశాం. మీరందరూ క్షేత్రస్థాయిలో ఉండి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం అందరినీ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించి ఎన్టీఆర్ జ్ఞాపికను బహూకరించారు. పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ తో ఆత్మీయ భేటీ పట్ల ‘మై టీడీపీ యాప్’ ఉత్తమ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. తాము జీవితాంతం మర్చిపోలేమని ఆనందం వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-meets-with-top-10-performers-of-my-tdp-app-39-216958.html
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.