Publish Date:Mar 19, 2025
ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదలీల క్రమబద్ధీకరణ బిల్లును మంత్రి నారా లోకేష్ బుధవారం (మార్చి 19) అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ హయాంలో ఉపాధ్యాయ బదలీలు అడ్డగోలుగా జరిగాయనీ, ఓ పద్ధతీ పాడూ లేకుండా ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల బదలీలు చేశారనీ విమర్శించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకమని ఆయన అన్నారు.
చంద్రబాబు పాలనలో అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయుల బదలీలు ఉండేవనీ లోకేష్ గుర్తు చేశారు. అందుకు భిన్నగంగా జగన్ హయాంలో అరాచకం రాజ్యమేలిందన్నారు. ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ బదలీలు చేశారనీ, కోర్టు మొట్టికాయలతో ఈ ట్రాన్స్ ఫర్ లను అప్పట్లో రద్దు చేశారని గుర్తు చేశారు. అందుకే ఉపాధ్యాయ బదలీలు పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయ బదలీల క్రమబద్ధీకరణ బిల్లు తీసుకువచ్చామన్నారు.
గతంలో ఉపాధ్యాయ బదలీల మార్గదర్శకాలు చాలా బలహీనంగా ఉండేవనీ, ప్రస్తుతం తమ పరభుత్వం తీసుకువచ్చే చట్టం ద్వారా బదలీల్లో పారదర్శకత, జవాబుదారీ తనం ఉంటాయని లోకేష్ చెప్పారు. ఈ బిల్లు ఏదో ఏకపక్షంగా ఆమోదింప చేసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదన్న లోకేష్, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఈ విషయంపై చర్చించామనీ, వారిచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా సమగ్ర బిల్లు రూపొందించామనీ లోకేష్ చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-introduce-ap-teachers-transfers-regulisation-bill-25-194659.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు