రాయలసీమకు పట్టిన క్యాన్సర్ జగన్.. లోకేష్

Publish Date:May 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ నిజానికి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ అన్నారు.  కడప పర్యటనలో భాగంగా లోకేష్, రాయలసీమ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడారు.  జగన్   మాటలు తప్పడం, మడమ తిప్పడంలోనే దిట్ట అన్న లోకేష్..   ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని   గణాంకాలతో సహా ఎండగట్టారు. జగన్ హయాంలో సీమ ప్రాంత ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.  

రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో   టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు. గతంలో అంటే 2014 - 2019 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 11,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు.  అయితే.. సీమ బిడ్డనని గొప్పలు చెప్పుకునే జగన్ తాను సీఎంగా ఉన్న  ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో కేవలం రూ. 2,700 కోట్లు మాత్రమే కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించినప్పుడు, దానివల్ల రాయలసీమకు జరిగే నష్టాన్ని ఆపడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన డ్రిప్ ఇరిగేషన్  అంటే బిందు సేద్యం ) వ్యవస్థను జగన్  రద్దు చేసి రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు.   టీడీపీ  హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో, అలాగే మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందించి అండగా నిలిచిందని గుర్తు చేశారు.  తన  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన నటన చూస్తే  ఆయనకు భాస్కర్ అవార్డు ఖాయంగా వస్తుందని ఎద్దేవా చేశారు.  సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైతే, ఆ ఘోరమైన నిజాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుపైకి నెట్టేందుకు జగన్ ఎంతటి డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.  మిషన్ రాయలసీమ  పేరుతో ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్,  డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నామన్న లోకేష్ . పుట్టపర్తిలో  ఐదో తరం యుద్ధ విమానాల (ఎఎంసీఏ) తయారీ కేంద్రానికి రూ. 15,803 కోట్లతో శంకుస్థాపన చేయడం రాయలసీమ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. జగన్ పాలన కేవలం ఫ్యాక్షనిజం, కమిషన్ల చుట్టూ తిరిగితే, తమ కూటమి ప్రభుత్వం ఫైటర్ జెట్ల తయారీతో సీమ యువతకు ఉపాధి కల్పిస్తోందని గర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ పునరుద్ఘాటించారు.

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.