చంద్రబాబుకు ప్రధాని పదవి వదంతులపై లోకేష్ ఏమన్నారంటే?

Publish Date:Jun 23, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చుట్టూ ఆసక్తికరమైన చర్చ  నడుస్తున్నాది.  తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలోకి ప్రవేసిస్తున్నారనీ, ఆయనకు ప్రధాని పదవి దక్కబోతోందంటూ  పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ముఖేష్ అంబానీ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ముఖేష్ అంబానీ, మాజీ ఉపరాష్ట్రపతి  జగదీప్ ధన్ ఖర్ లు కలిసి మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నించారనీ, ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతిలో భేటీ అయ్యారనీ, ఆ సందర్భంగా ప్రధాని పదవి రేసులో చంద్రబాబు ఉండాలని ఆఫర్ చేశారనీ జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరిగింది.  ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు.  దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక  బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.  

కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశానికి తిరుగులేని రాజకీయ స్థిరత్వాన్ని అందిస్తోందన్న లోకేష్.. జాతీయ స్థాయిలో మోదీ ప్రవేశపెడుతున్న ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలు దేశాన్ని అగ్రపథాన నిలుపుతున్నాయన్నారు.  ఇక ఏపీలో తమ దృష్టి అంతా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం,  ప్రగతిపైనే ఉందని   ఉద్ఘాటించారు.  వైసీపీ  ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనీ,  రాజధాని అమరావతి అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారని చెప్పిన లోకేష్..   ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అందిస్తున్న మద్దతు మరువలేనిదని లోకేష్ పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణానికి చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మక పరిణామమని, అందుకే తాను వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపానే తప్ప..  అందులో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదా పదవుల ఆశ లేదని కుండబద్దలు కొట్టేశారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీని నిలబెట్టడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లక్ష్యమన్నారు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.