Publish Date:Jun 23, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నాది. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలోకి ప్రవేసిస్తున్నారనీ, ఆయనకు ప్రధాని పదవి దక్కబోతోందంటూ పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ముఖేష్ అంబానీ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ముఖేష్ అంబానీ, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ లు కలిసి మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నించారనీ, ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతిలో భేటీ అయ్యారనీ, ఆ సందర్భంగా ప్రధాని పదవి రేసులో చంద్రబాబు ఉండాలని ఆఫర్ చేశారనీ జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరిగింది. ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశానికి తిరుగులేని రాజకీయ స్థిరత్వాన్ని అందిస్తోందన్న లోకేష్.. జాతీయ స్థాయిలో మోదీ ప్రవేశపెడుతున్న ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలు దేశాన్ని అగ్రపథాన నిలుపుతున్నాయన్నారు. ఇక ఏపీలో తమ దృష్టి అంతా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం, ప్రగతిపైనే ఉందని ఉద్ఘాటించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనీ, రాజధాని అమరావతి అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారని చెప్పిన లోకేష్.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అందిస్తున్న మద్దతు మరువలేనిదని లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి నిర్మాణానికి చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మక పరిణామమని, అందుకే తాను వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపానే తప్ప.. అందులో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదా పదవుల ఆశ లేదని కుండబద్దలు కొట్టేశారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీని నిలబెట్టడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లక్ష్యమన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-clarify-on-roumors-on-pm-post-to-cbn-25-223872.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.