తాడేపల్లి ప్యాలెస్ దాటి రా.. చర్చకు సిద్ధం.. జగన్ కు లోకేష్ సవాల్!

Publish Date:Jun 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు..  ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని  సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.

గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులను ఘోరంగా వంచించిందని లోకేష్ ధ్వజమెత్తారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పారదర్శకంగా మెగా డీఎస్సీ ప్రక్రియను చేపట్టి 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు వేసిందని గుర్తుచేశారు. ఈ భర్తీ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు 240కి పైగా కోర్టు కేసులు వేసి కుట్రలు పన్నారని ఆరోపించారు. కోర్టులు ఆ కేసులను కొట్టివేసినా..  ఇంకా బురదజల్లేందుకే వైకాపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. త్వరలోనే మళ్లీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు నమ్మకం ప్రకటించారు.

రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నేతలు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలను లోకేష్ తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల వైకాపా నేతలకు ఉన్న సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు. ఒక హోంమంత్రి అని కూడా చూడకుండా ఆమె దుస్తులు, బాడీ లాంగ్వేజ్‌పై నీచంగా మాట్లాడిన వ్యక్తిని మెచ్చుకుంటూ జగన్‌మోహన్ రెడ్డి ఫోన్ చేసి అభినందించడం దారుణమన్నారు. తమ కుటుంబ మహిళలను గతంలో అవమానించినా.. తాము మాత్రం ప్రతిపక్ష మహిళా నేతలను గౌరవిస్తామని, సోషల్ మీడియాలో హద్దులు దాటిన తమ కార్యకర్తలను సైతం జైలుకు పంపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్‌లకే పరిమితం కాకుండా జగన్ క్షేత్రస్థాయిలోకి వస్తే నిజాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4,000 వృద్ధాప్య పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను పక్కాగా అమలు చేస్తోందని వివరించారు. ఐటీ ఆధారిత అప్లికేషన్ల ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తుంటే, అవగాహన లేని వైకాపా నేతలు ఓట్లు తొలగిస్తున్నారంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. అభివృద్ధిపై చర్చకు జగన్ ఎక్కడికి రమ్మన్నా తానే వస్తానని లోకేష్ సవాల్ విసిరారు.

By
en-us Political News

  
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది.
వైసిపి నేత పెర్ని నాని ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ.. కానీ తెలంగాణలో ఎవడో ఒంట్లో బాలేదు అంటే వస్తున్నా తమ్ముడూ అంటూ వెళ్ళిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇటీవల ఒక జాతీయ టీవీ చానల్ కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెడతారా అన్న ప్రశ్రకు ఆమె భావోద్వేగంగా స్పందించారు.
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం
కాక్రోచ్ పార్టీ కేవలం ఒక నిరసన వేదికగా కాకుండా, కాక్రోచ్ జనతా పార్టీగా రూపాంతరం చెందుతూ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
కూటమి రెండేళ్ల పాలనపై ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.
గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.