తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు బంపరాఫర్ ఇచ్చారు. ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం కాదు.. వాటికి తగిన ఆధారాలు కూడా చూపించాలని చెబుతూనే.. జగన్ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం చూపినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కు ఇది బంపరాఫరే.. ఎందుకంటే లోకేష్ సవాల్ ను స్వీకరించి.. ఆధారాలు చూపకపోతే జగన్ ఏం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సారీ చెబితే చాలు.
కేవలం తాను ప్రభుత్వంపై చేస్తున్న ఓ ఆరోపణకు సంబంధించి చిన్న ఆధారం బయట పెట్టడమే. అలా చేస్తే తాను రాజీనామా చేస్తానని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సవాల్ చేశారు. ఇప్పుడు జగన్ కు తాను చెప్పింది అబద్దం కాదని.. తాను ఫేక్ చేయడం లేదని నిరూపించుకోవడానికైనా స్పందించి.. ఆధారాలు సమర్పించాల్సి ఉంది. లేకపోతే జగన్ రెడ్డి ఫేక్ పాలిటిక్స్ మరోసారి ఎక్స్ పోజ్ అవుతుంది.
ఇటీవలి కాలంలో జగన్ ఎప్పుడు మాట్లాడినా ఉర్సా క్లస్టర్ కంపెనీకి తెలుగుదేశం కూటమి సర్కార్ అతి ఉదారంగా నామమాత్రపు ధరకు ఎకరాలకు ఎకరాలు ఇచ్చేసిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. రూపాయికి ఇడ్లీలు కూడా రావనీ, అలాంటిది ఆ నామమాత్రపు ధరకు కూటమి సర్కార్ ఉదారంగా ఉర్సా కు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేసిందనీ చేస్తున్న ఆరోపణలపైనే ఎక్స్ వేదికగా లోకేష్ స్పందించారు. ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపితే తాను రాజీనామా చేస్తాననీ, అలా చూపలేకపోతే జగన్ క్షమాపణ చెబితే చాలనీ సవాల్ విసిరారు.
ఉర్సా కంపెనీకి ఎకరా కోటి రూపాయలు చొప్పున 3.5 ఎకరాలు.. ఎకరా 50 లక్షల రూపాయలు చొప్పున 56.5 ఎకరాల భూమిని ఉర్సా కు కేటాయించారు. ఈ మేరకు జీవోల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే జగన్ మాత్రం వాస్తవాలతో సంబంధం లేకుండా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పిస్తున్నరు. ఈ నేపథ్యంలోనే జగన్ ఫేక్ రాజకీయానికి చెక్ పెట్టేలా లోకేష్ బహిరంగ సవాల్ విసిరి ఉర్సాకు ఉదారంగా భూములు కట్టబెట్టినట్లు ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తానంటూ చాలెంజ్ చేశారు. మరి లోకేష్ సవాల్ కు జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-challange-to-jagan-39-199191.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?