ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నారా లోకేష్
Publish Date:Oct 30, 2024
Advertisement
ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించిన నారా లోకేశ్... ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో పాల్గొన్నారు. లాస్ వెగాస్ లో జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొన్నలోకేష్ పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్, పెప్సికో మాజీ సిఇఓ ఇంద్రానూయి, రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాలతో లోకేశ్ ఈ సదస్సులో భాగంగా భేటీ అయ్యారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన సాగుతున్నది. మొత్తంగా ఈ సమ్మిట్ లో లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలపై నారా లోకేశ్ పారిశ్రామిక వేత్తలకు వివరిస్తున్నారు. అంతేకాకుండా, ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో విశిష్ట అతిథిగా నారా లోకేశ్ కీలకోపన్యాసం చేయనున్నారు. కాగా ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో భాగంగా పెప్సికో మాజీ చైర్మన్ అండ్ సీఈవో ఇంద్రానూయితో భేటీ అయిన నారా లోకేస్ దార్శనికుడు నారా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎపి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కావాల్సిందిగా ఇంద్రానూయీని కోరారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వివరించిన లోకేష్ వివిధ రంగాలలో మహిళలకు సాధికారత కల్పించడంపై మీ ఆలోచనలను మాతో పంచుకోండని ఇద్రానూయిని అడిగారు. విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోం దని వివరించారు. ఎపిలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామన్న లోకేష్ ఇంద్రానూయిని ఆంధ్రప్రదేశ్ సందర్శనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. లోకేష్ ప్రతిపాదనలు, ఆహ్వానంపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణలో లోకేష్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్ తోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి, రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరారు. అందుకు రేచల్ స్కాఫ్ సానుకూలంగా స్పందించారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ పై అమెజాన్ దృష్టి సారిస్తోందదని వివరించారు. ఏపిలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్నిసీరియస్ గాపరిశీలిస్తామని తెలిపారు. అనంతరం రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. లోకేష్ ప్రతిపాదనల పట్ల అశ్వినీ భరత్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/lokesh-center-of-attraction-in-it-serve-sinergy-summitt-25-187633.html