రెడ్ బుక్ మరిచిపోలేదు.. అక్రమార్కులకు శిక్ష తప్పదు!

Publish Date:Jan 16, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ మయాంలో అరాచకత్వం రాజ్యమేలింది. ఐదేళ్ల జగన్ పాలన అంతా అవినీతి, అరాచకం, దౌర్జన్యం, దోపిడీ అన్నట్లుగా సాగింది.   ఆ పార్టీ నేత‌లు యధేచ్ఛగా అందినకాడికి ప్ర‌భుత్వ భూములు, అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జా  చేసేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురి చేశారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అదికారంలోకి వచ్చిన జగన్ తన హయంలో దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని నానా  రకాలుగా వేధింపులకు గురి చేశారు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను అన్ని విధాలుగా వేధింపులకు గురి చేశారు. సరే జనం జగన్ అరాచక పాలనకు ఛీ కొట్టి గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత గత ఐదేళ్ల పాలనలో తాము ఎదుర్కొన్న వేధింపులు, మానసిక వేదనకు  న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కార్ జగన్ హయాంలో  జరిగిన అరాచకత్వం, అన్యాయం, దౌర్జన్యం, దోపిడీలపై చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం నేతలు, క్యాడర్ తో పాటు జగన్ హయాంలో వేధింపులకు గురైన జనసైనికులు కూడా ఆశించారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా.. ఆ దిశగా ఎటువంటి చర్యలూ లేకపోవడం వారిని ఒకింత నిరాశకు గురి చేసింది.  గత ఐదేళ్ల వైసీపీ పాలనలో  అవమానాలు, వేధింపులు, అక్రమ కేసులను ఎదుర్కొన్న తెలుగుదేశం, జనసేన నేతలు, క్యాడర్ కు జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు అన్న ఆశ ఈ ఆరు నెలలుగా అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. 

యువగళం పాదయాత్ర సందర్భంగా రెడ్ బుక్ ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ నిబంధనలను తుంగలోకి తొక్కి అరాచకాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరి పేర్లూ ఈ రెడ్ బుక్ లో నోట్ చేశాననీ, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామనీ చెప్పిన లోకేష్ కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టారా అన్న అనుమానాలు వారిలో వ్యక్తమౌతున్న పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలో నారా లోకేష్ తాను రెడ్ బుక్ ను మరిచి పోలేదని ఉద్ఘాటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సకుటుంబ సపరివార సమేతంగా కుప్పంలో సంబరాలు చేసుకున్న ఆయన ఆ సందర్భంగా  కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన లోకేష్ రెడ్ బుక్ లో  పేరున్న ప్రతి  ఒక్కరూ వారి పాపాలకు తగిన మూల్యం చెల్లించాల్సిందేననీ, అలా చెల్లించే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు. తాను రెడ్ బుక్ ను మరిచిపోలేదనీ, అన్యాయాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదనీ, ఇప్పటికే రెడ్ బుక్ తన పని తానూ చేసుకుంటూ పోతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్, ఇసుక మాఫియాలు నడిపిన వారు  త్వరలో  కటకటాలు లెక్కించడం తధ్యమన్నారు. దీంతో తెలుగుదేశం, జనసేనలలో ఉత్సాహం నెలకొంది. రెడ్ బుక్ ను లోకేష్ మరిచి పోలేదనీ, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనీ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.