లోకేష్ , పవన్ ఉమ్మడి యాక్షన్.. ఈ దూకుడు ఆపేదెవరు?!

Publish Date:Nov 5, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు ముందు ఆ పార్టీ దూకుడు అంతా ఇంతా కాదు. అధికార వైసీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తగ్గించేలా దూకుడు ప్రదర్శించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహీతో విడతల విడతలుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ప్రతిపక్షాల దాడితో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. అలాంటి సమయంలో చంద్రబాబు అరెస్టు ప్రతిపక్షాలను షాక్ కి గురిచేసింది. అయితే, జస్ట్ రోజుల వ్యవధిలో తేరుకున్న తెలుగుదేశం అంతకు మించిన కార్యాచరణతో నిరసనలతో హోరెత్తించి తమ అధినేత అరెస్టు కుట్ర పూరితం అనేది బలంగా ప్రజలలోకి తీసుకెళ్లగలిగింది. ఫలితంగా  వైసీపీకి కుదేలైంది. చంద్రబాబు అరెస్టు సాక్షిగా తెలుగుదేశం, జనసేన ఒక్కటయ్యాయి. అధికారికంగా పొత్తు ప్రకటనతో రెండు పార్టీల క్యాడర్ లో జోష్ పెరిగింది. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసుకొనేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఎలా ముందుకెళ్లాలో కూడా నిర్ణయించుకున్నారు. ఈలోగా చంద్రబాబు కూడా బెయిల్ మీద బయటకొచ్చారు.

స్కిల్ కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే ఇప్పుడైతే  తెలుగుదేశం,జనసేన  ఉమ్మడిగా జగన్ ప్రభుత్వంపై అటాక్ చేసేందుకు సిద్ధమయ్యాయి. చంద్రబాబు జైల్లో ఉండడంతో అన్నీ తానైన లోకేష్ కేపబిలిటీ ఏంటో కూడా రాజకీయ వర్గాలకు అర్ధమయింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రాపో కూడా పెరిగింది. ఈ తరుణంలోనే ఇప్పుడు పవన్, లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పొత్తు ప్రకటన తర్వాత ఇప్పటి వరకూ రాజ‌కీయ అంశాల‌పై ప‌వ‌న్‌తో చంద్రబాబు నేరుగా సంప్రదించలేకపోయారు. చంద్రబాబు విడుదల సమయంలో పవన్.. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహానికి ఇటలీ వెళ్లారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత తాజాగా ఆయన నివాసానికి వెళ్లిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. అలాగే నారా లోకేష్‌తో గంట‌ల‌కు పైగా ప‌వ‌న్‌, మ‌నోహ‌ర్‌లు సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్రమంలోనే తదుపరి కార్యాచరణను అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ముందుగా ఇరు పార్టీల్లో ఉన్న అసంతృప్తుల‌ను త‌గ్గించి, పార్టీల‌ను క‌లిసి పోరాడేలా, ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న అంశాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించినట్లు తెలుస్తుంది. రానున్న మూడు వారాలలో ఇరు పార్టీలలో సమస్యలను పరిష్కరించుకొని అసలు సిసలైన యుద్ధం మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు ఇరు పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఉమ్మ‌డి మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌, బ‌హిరంగ స‌భ‌లు, ప్ర‌జ‌ల‌తో నేతల ముఖాముఖీ వంటి అంశాల‌పై ఇరు పార్టీలు సంయుక్తంగా ముందుకు సాగేలా కార్యాచ‌ర‌ణ‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. అలాగే నవంబర్ నెలాఖరున లేదా డిసెంబర్ మొదటి వారంలో ప‌వ‌న్‌, నారా లోకేష్‌లు సంయుక్తంగా స‌భ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ సభ అనంతరం సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారని చెబుతున్నారు.

పవన్, లోకేష్ ల ఉమ్మడి సభ ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అవుతున్నది. పసుపు దళానికి జనసైనికులు తోడవడం.. ప్రతిష్టాత్మక నిర్మాణం ఉన్న టీడీపీకి ఛరిష్మా గల పవన్ కళ్యాణ్ జత కలవడం అంటే రెండు పార్టీలలో జోష్ పెంచే అంశమే  అలాంటిది రెండు పార్టీలు కలిసి బహిరంగ సభ అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఆ సభ ప్రత్యర్థులకు ఏ స్థాయి హెచ్చరికలను జారీ చేయనుందో  మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావం  మోగించాలని తెలుగుదేశం, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ సభ ద్వారానే ఇరు పార్టీల నేతలకు, క్యాడర్ కు అధికారం మనదే అనే సంకేతాలు  బలంగా ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కలయికను జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు ఈ సభ తర్వాత ఎలా స్పందించనున్నాయన్నది ఆసక్తిగా మారింది. ఈ సభ తర్వాత ఏపీ రాజకీయాలలో బిగ్ టర్న్ ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.