లోకేష్.. దారి రహదారి

Publish Date:Jan 23, 2023

Advertisement

ఎవరైనా విజయం సాధించాలంటే కష్టపడాల్సిందే. తండ్రి వారసత్వమనో.. మరోటనో అడ్డదారిలో అందలాలు ఎక్కినా.. అక్కడ నిలవాలంటే టాలెంట్ ఉండాల్సిందే. లేకుంటే అడ్డదారుల్లో ఎంత ఎత్తు ఎదిగినా.. అక్కడ నుంచి పడితే మళ్లీ లేవడం అసాధ్యం. లేవలేరు.. లేద్దామనుకున్నా జనం లేవనీయరు. తొక్కేస్తారు. పాతేస్తారు.

మనకు సినీ, రాజకీయ రంగాలలో అలా టాలెంట్ లేకుండా నెపోటిజంతొ అగ్రస్థానానికి చేరుకున్నా.. అక్కడ నుంచి కింద పడ్డాకా వారిని గుర్తు పెట్టుకునే వారు కూడా ఉండరు. ఎవరికైనా వారసత్వమనేది.. తొలి అడుగుకే పనికి వస్తుంది. ఆ తరువాత ఎవరైనా సరే సొంత కాళ్ల మీద నిలబడాని.. సొంత బాట పరచుకోవాలి. సొంత నడక నడవాలి. అయితే.. అలా తొలి అడుగు కూడా వేయకుండానే దారుణంగా ట్రోలింగ్ కు గురైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాత్రమే. ఆయన  రాజకీయాలలో తొలి అడుగు వేడయానికి ముందే ఆయనపై వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా దాడి ఆరంభమైంది. ఆయన ప్రతిభను పట్టించుకోకుండా ఆయన ఆహార్యం, ఆహారం లక్ష్యంగా ఎదుగుదలను అడ్డుకోవడమే ధ్యేయంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బ్యాక్ స్టాబింగ్ అనదగ్గ స్థాయిలో విమర్శల దాడి చేశాయి. పప్పు అన్నాయి.  

ఉన్నత విద్యావంతడైన లోకేష్.. సమాజంలో మార్పునకు, బడుగులకు ప్రయోజనం చేకూర్చే విధానాలకు పార్టీని వేదిక చేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా పార్టీ పటిష్టతకు కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన అవసరాన్ని గుర్తెరిగారు. పార్టీ కార్యకర్తలకు బీమా కల్పించిన మొట్టమొదటి  పార్టీ భారత దేశంలో బహుశా తెలుగేదేశం పార్టీయే. ఆ ఆలోచన లేకేష్ దే. ఆ విషయాన్ని ఏ పార్టీ కార్యకర్తను అడిగినా చెబుతారు.  ఇక పార్టీల ప్రభుత్వాలూ ఇప్పడు అమలు చేస్తున్న నగదు బదలీ (క్యాష్ ట్రాన్స్ఫర్) పథకం లోకేష్ బ్రెయిన్ చైల్డే. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యర్థులు ఆయనలోన ప్రతిభను ప్రపంచానికి తెలియకుండా చేయడమే లక్ష్యంగా ఆరంభం నుంచే విమర్శలతో, ఎగతాళి చేయడంతో, ట్రోలింగ్ కు గురి చేయడంతో ఆయన ఇమేజ్ పై దెబ్బకొట్టే వ్యూహంతో పని చేశారు. సామాజిక మాధ్యమాన్ని ఇందుకు వేదికగా వాడుకున్నారు.

అయితే ఈ కుట్రల్నీ, కుతంత్రాల్నీ లోకేష్ సమర్ధంగా ఎదుర్కొన్నారు. సంయమనం కోల్పోకుండా కూల్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడమే ధ్యేయంగా కదిలారు. ఇప్పుడు ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. అందుకు ఆయన యువగళం పేర పాదయాత్ర సాగుతున్నారంటే.. అధికార పార్టీలో కనిపిస్తున్నవణుకే నిదర్శనం. టీడీపీకి పునర్వైభవం ఆయన అడుగులతోనే సాధ్యమౌతుందని తెలుగుదేశం శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అధికార పార్టీ కూడా అందుకే భయపడుతోంది. కార్యకర్తలతో పర్సనల్ గా టచ్ లో ఉండటం.. వైసీపీ నేతల విమర్శలకు దీటుగా బదులివ్వడం, సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉండటం లోకేష్ తనను తాను నాయకుడిగా మలచుకోవడంలో అనుసరించిన విధానాలు. రాజకీయ అరంగేట్రం నుంచి లోకేష్ పై ఒక పద్ధతి ప్రకారం, వ్యూహాత్మకంగా జరిగిన వ్యక్తిత్వ హనన దాడి కారణంగా తొలి నాళ్లలో ఏర్పడిన ఇమేజ్ ను లోకేష్ సమర్ధంగా పటాపంచలు చేశారు. సంపూర్ణ నాయకుడిగా, సొంత వ్యక్తిత్వంతో ఎదిగారు. తన నాయకత్వంపై ప్రజలలో నమ్మకం కలిగించారు.   ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు.  ప్రజలు ఆయన మాటలు వినడానికి తహతహలాడుతున్నారు. లోకేష్ పై గతంలోలా లోకేష్ పై విమర్శలు చేయాలంటే ప్రత్యర్థులు ఒకటికి రెండు సార్లు కాదు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది.

లోకేష్ పాదయాత్ర తమ కాళ్ల కింద భూమిని కదిలించేస్తుందన్న భయం అధికార పార్టీలో నెలకొని ఉంది. ఇదే లోకేష్ విజయం. ముందు ముందు మరిన్ని విజయాలకు ఇదే ఆరంభం. ఆల్ ది బెస్ట్.. అండ్ హ్యాపీ బర్త్ డే లీడర్ లోకేష్.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.