వైనాట్ 175 కాదు.. కనీసం కడపలో టెన్ ఔటాఫ్ టెన్ అయినా సాధ్యమా?

Publish Date:Jan 23, 2023

Advertisement

రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయా? ఆది నుంచీ బలంగా ఉన్న రాయల సీమలో సైతం వైసీపీ పునాదులు కదులుతున్నాయా? అంటే విపక్షం ఔననే అంటేందు. సర్వేలూ పరిస్థితి అలానే ఉందని చెబుతున్నాయి. సీమకు చెందిన కొందరు వైసీసీ నేతలు సైతం జగన్ ఆటలు ఇంక సీమలో సాగే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నరు.  

ఇదే మాట తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తరచూ చెబుతున్నారు. నిజంగానే సీమలో వైసీపీకి ప్రతికూల వాతావరణం ఉందా అంటే తాజాగా  మాజీ మంత్రి, కపడ జిల్లా కమలాపురం  వాసి వీరశివారెడ్డి కూడా ఔననే అంటున్నారు.  వైసీపీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని కుండబద్దలు కొట్టడమే కాదు.. రాయలసీమలోనూ, జగన్ సొంత జిల్లా అయిన కడపలోనూ ఆ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెబుతున్నారు. వీర శివారెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా రాజకీయాలలో ప్రవేశించారు.

మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరినా.. 2019లో ఆయన వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచారు.  ఇప్పుడు ఆయనే వైసీపీ పనైపోయిందని చెబుతున్నారు. ఆయనే కాదు.. సొంత పార్టీ అని కూడా చూడకుండా డీఎల్ రవీంద్రారెడ్డి కూడా  జగన్ పనైపోయిందనీ, జనం ఆయనకు ఇచ్చిన ఒక్క చాన్స్ దుర్వినియోగం అయ్యిందనీ, మరో చాన్స్ అవకాశమే లేదని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ ఇరువురూ కూడా సీమలో చెప్పుకోదగ్గ బలం, పలుకుబడి ఉన్న నాయకులే. ఇరువురూ మాజీ మంత్రులే. వీరే కాకుండా పలువురు మాజీ ఎమ్మెల్యేలు.. అదీ రాయలసీమకు చెందిన వారే జగన్ పార్టీకి ఇక సీమలో కూడా చుక్కలే కనిపిస్తాయని చెబుతున్నారు. వీళ్లందరూ కూడా సైకిలెక్కే ఉద్దేశంతోనే వైసీపీ వ్యతిరేక గళం వినిపిస్తున్నారని అధికార పార్టీ లైట్ గా తీసుకుంటోంది.

అయితే వీరే కాకుండా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి కూడా తెలుగుదేశం పలుకులే పలుకుతున్నారు. అంటే ఇప్పటికే సీఎం సొంత జిల్లా అయిన కడపలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార పార్టీ నాయకులు జగన్ విజయం అసాధ్యమన్న రీతిలో ప్రకటనలు చేస్తున్నారు.   2019 ఎన్నికలలో కడప జిల్లాలో పది పది అసెంబ్లీ నియోజకవ్గాలలోనూ విజయం సాధించిన వైసీపీకి ఇప్పుడు నాటి హవా కొనసాగించడం అసాధ్యమనే పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.

అన్నిటికీ మించి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఈ సారి జగన్ కు గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమని అంటున్నారు. వైఎస్ వివేకా హత్య, ఆయన కుటుంబాన్ని జగన్ దూరం పెట్టడం, వివేకా హత్య కేసులో అనుమానితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు నియోజకవర్గంలో జగన్ పట్ల వ్యతిరేకతను పెంచాయని అంటున్నారు.   సీమలోనే వైసీపీకి వ్యతిరేక సెగలు ఉన్నాయంటే.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో ఆ పార్టీ మరింత గడ్డపరిస్థితిని ఎదుర్కొంటుందనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.