లోక్‌భవన్‌ ‘ఎట్ హోమ్’.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!

Publish Date:Aug 14, 2026

Advertisement

 

 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న సాయంత్రం 6 గంట లకు రాజ్‌భవన్‌ (లోక్‌భవన్‌)లో తెలంగాణ గవర్నర్‌ ‘ఎట్ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమా నికి వీఐపీలు, సీనియర్‌ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్‌ భవన్‌ రోడ్డులో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ డీ. జోయల్‌ డేవిస్‌ తెలిపారు. వాహనదారులు ప్రత్యా మ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిం చారు. మొనప్ప ఐలాండ్‌ నుంచి వీవీ విగ్రహం జంక్షన్‌ (ఖైరతాబాద్‌) వరకు రాజ్‌భవన్‌ రోడ్డులో ఇరువైపులా వాహనాల రాకపోకలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. 

సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు. బ్రౌన్‌ పాస్‌ వాహనాలు రాజ్‌భవన్‌ గేట్‌ నంబర్‌-1 ద్వారా ప్రవేశించి, కేటాయించిన పార్కింగ్‌ ప్రదేశాల్లో వాహనాలను నిలపాలి. కార్యక్రమం అనంతరం గేట్‌ నంబర్‌-2 ద్వారా బయటకు వెళ్లాలి. బ్లూ పాస్‌ వాహనాలు గేట్‌ నంబర్‌-3 ద్వారా రాజ్‌భవన్‌లోకి ప్రవేశించి, గవర్నర్‌ సెక్రటరీ (జీఎస్‌) గేట్‌ ద్వారా బయటకు వెళ్లాలి. 

రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌ బై-లేన్‌, సంస్కృతి కమ్యూనిటీ హాల్‌, రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాల, రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌, గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజ్‌, రాజ్‌భవన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ బిల్డింగ్‌, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్‌ స్కూల్‌ వరకు సింగిల్‌ లేన్‌ పార్కింగ్‌, ఎంఎంటీఎస్‌ పార్కింగ్‌, స్కై సిటీ బిల్డింగ్‌ పార్కింగ్‌ ప్రాంతాల్లో వాహనాలను నిలపాలి. ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపు లకు వాహనదారులు సహకరించాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. లైవ్‌ ట్రాఫిక్‌ అప్‌డేట్ల కోసం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించాలని సూచిం చారు. అత్యవసర ప్రయాణ సహాయం కోసం 9010203626 ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవ చ్చునని హైదరాబాదు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ. జోయల్‌ డేవిస్‌ తెలిపారు 

Lok Bhavan At Home, Raj Bhavan, Commissioner D. Joel Davis, Hyderabad traffic, CM Revanth reddy

By
en-us Political News

  
వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంపు..!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముందుగానే..!
BCI తీరుపై తీవ్ర అభ్యంతరం..!
హైదరాబాద్ పోలీస్‌లకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు..!
స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.