లోక్‌భవన్ ‘ఎట్ హోమ్’.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!
Publish Date:Aug 14, 2026
Advertisement
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న సాయంత్రం 6 గంట లకు రాజ్‌భవన్ (లోక్‌భవన్)లో తెలంగాణ గవర్నర్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమా నికి వీఐపీలు, సీనియర్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ రోడ్డులో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ. జోయల్ డేవిస్ తెలిపారు. వాహనదారులు ప్రత్యా మ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిం చారు. మొనప్ప ఐలాండ్ నుంచి వీవీ విగ్రహం జంక్షన్ (ఖైరతాబాద్) వరకు రాజ్‌భవన్ రోడ్డులో ఇరువైపులా వాహనాల రాకపోకలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు. బ్రౌన్ పాస్ వాహనాలు రాజ్‌భవన్ గేట్ నంబర్-1 ద్వారా ప్రవేశించి, కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను నిలపాలి. కార్యక్రమం అనంతరం గేట్ నంబర్-2 ద్వారా బయటకు వెళ్లాలి. బ్లూ పాస్ వాహనాలు గేట్ నంబర్-3 ద్వారా రాజ్‌భవన్‌లోకి ప్రవేశించి, గవర్నర్ సెక్రటరీ (జీఎస్) గేట్ ద్వారా బయటకు వెళ్లాలి. రాజ్‌భవన్ క్వార్టర్స్ బై-లేన్, సంస్కృతి కమ్యూనిటీ హాల్, రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల, రాజ్‌భవన్ క్వార్టర్స్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, రాజ్‌భవన్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లేన్ పార్కింగ్, ఎంఎంటీఎస్ పార్కింగ్, స్కై సిటీ బిల్డింగ్ పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను నిలపాలి. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు లకు వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. లైవ్ ట్రాఫిక్ అప్డేట్ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని సూచిం చారు. అత్యవసర ప్రయాణ సహాయం కోసం 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవ చ్చునని హైదరాబాదు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ. జోయల్ డేవిస్ తెలిపారు Lok Bhavan At Home, Raj Bhavan, Commissioner D. Joel Davis, Hyderabad traffic, CM Revanth reddy
http://www.teluguone.com/news/content/lok-bhavan-at-home-36-228959.html





