తాడేపల్లి ప్యాలెస్ లో లిక్కర్ ప్రకంపనలు ?

Publish Date:Sep 13, 2022

Advertisement

దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం, ఏపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ తలుపులనే తడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కుటుంబ సభ్యులతో పాటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఇందులో పాత్ర ఉందని టీడీపి ఆరోపిస్తోంది. ఢిల్లీలో తీగలాగితే, తాడేపల్లి డొంకంతా కదులు తోందని అంటున్నారు. అలాగే, ఢిల్లీ కుంభకోణం మూలాలు తాడేపల్లి ప్యాలెస్ లో బయటపడుతున్నాయని చెబుతున్నారు. 

సరే, ఆ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి? ముఖ్యమంత్రి సతీమణి భారతి ప్రమేయం ఏమైనా వుందా? విజయ సాయి రెడ్డి పాత్ర ఏమిటి? అనేది, సిబిఐ విచారణలో తేలుతుంది. అంతవరకు ఎవరు ఏది చెప్పినా, ఏ ఆరోపణ చేసినా, అది ఉహజనితమే అవుతుంది.   అయితే, ఢిల్లీ కుంభకోణంతో ప్యాలెస్ సంబంధాల ప్రకంపనలు మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి సతీమణి భారతి టార్గెట్’గా ఆరోపణలు చేస్తున్నా, మంత్రులు ఎవరూ స్పందించక పోవడాన్ని, ముఖ్యమంత్రి నేరంగా పరిగణించి, శిక్ష తప్పదని హెచ్చరించడం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపనలు ప్యాలెస్ లో ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. 

అదొకటి అలా ఉంటే, తాజాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టే, రాజ్యసభ సభ్యుడు, విజయసాయి రెడ్డిని మెల్లమెల్లగా దూరం పెడుతున్న తీరు కూడా అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, భారతి పేరుతొ పాటుగా విజయసాయి రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో  విజయసాయి రెడ్డికి ప్యాలెస్ ఎంట్రీ లేదని వస్తున్న వార్తలు అనుమానాలు ఇంకొంత పెంచుతున్నాయి. 

అదలా ఉంటే, ఇప్పడు కొత్తగా ఇంకొక వార్త వినవస్తోంది. జగన్ రెడ్డి, విజయసాయి మధ్య దూరం పెరిగిన నేపధ్యంలో సజ్జల మరోమారు,, ప్యాలెస్ పాలిటిక్స్ లో పై చేయి సాధించారని, అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా అంటే ముందు నుంచి కూడా విజయసాయి రెడ్డి పేరే వినిపిస్తూ వస్తోంది. అయితే చెప్పాపెట్టకుండా, సోషల్ మీడియా బాధ్యతలను, సజ్జల టేకోవర్ చేసినట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డి అదేశాల మేరకు సోషల్ మీడియాలో మార్పులు చేర్పులు జరిగినట్లు చెపుతున్నారు. విజయసాయి రెడ్డి బాధ్యతలను మరో ముఖ్యనేత కుమారుడికి అప్పగించారని తెలుస్తోంది. 

నిజానికి పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్ కోసం చాలా కాలంగా, సజ్జల, విజయసాయి మధ్య పోటీ నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో సర్వం విజయసాయి చేతుల్లోనే ఉండేది. అయితే విశాఖ ఎల్జీ పాలిమర్స్‌’లో ప్రమాదం సంభవించిన సమయంలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రితో పాటు బయలుదేరిన విజయ సాయి రెడ్డిని కారు దించి వెనక్కి పంపించడంతో మొదలైన జగన్ రెడ్డి బొమ్మా బొరుసు ఆట  .... చాలా చాలా మలుపులు తిరిగింది. విజయసాయి ముఖ్యమంత్రికి దూరమయ్యారు. సజ్జల రామకృష్ణా రెడ్డి దగ్గరయ్యారు. సర్వ శాఖల మంత్రిగా చక్రం తిప్పారు. విజయసాయి పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యారు.తర్వాత ఏమైందో కానీ జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలను కూడా ఆయనకే అప్పగించారు.కానీ ఇప్పుడు అనధికారికంగా అయినా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డే చూసుకుంటున్నారు.
ఈ మార్పుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ముఖ్యమంత్రి సతీమణి భారతి పేరు పైకి రావడమే ప్రధాన కారణం అంటున్నారు.

విజయసాయి రెడ్డి ప్రమేయంతోనే భారతి పేరు బయటకు వచ్చిందని ముఖ్యమంత్రి అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, జగన్ రెడ్డి ఆయన్ని దూరంగా ఉంచుతున్నారని అంటున్నారు. నిజానికి గతంలోనూ జగన్ రెడ్డి విజయసాయి విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నా, ముఖ్యమంత్రి సతీమణి భారతి జోక్యంతో విజయసాయి పోయిన ప్రాధాన్యతను తిరిగి తెచ్చుకున్నారని  అంటున్నారు. అయితే ఇప్పడు, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విజయసాయి రెడ్డి పేరుతొ పాటు భారతి పేరు కూడా బయటకు రావడంతో, ఇప్పుడు ఆమె విజయసాయిని బయట పడేసే అవకాశమే లేదని అంటున్నారు. సో .. జగన్ రెడ్డి పరమ పద సోపాన పటంలో మరోమారు, సాయి డౌన్ అయ్యారు. సజ్జల నిచ్చెన ఎక్కారు , అంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.