Publish Date:Apr 25, 2025
లిక్కర్ స్కామ్ దృష్టి మళ్లించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. త్వరల్లో మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతల అవినీతి అంతా త్వరలోనే బయటపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై దుష్ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఉత్సాహం చూపుతున్నారని, 9 నెలల్లో రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ హయాంలో 21 సూట్ కేసు కంపెనీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. 21వ సెంచరీ రియాల్టీస్లో భాగస్వాములు.. ఎవరో కేశినేని ట్రావెల్స్ భాగస్వాములెవరో అందరికీ తెలిసన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటుంటూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ఎన్నారైల పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని కేశినేని చిన్ని సూచించారు. ఎన్నారైలకు తాము అండగా ఉంటామని, రాష్ట్రంలో నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చని కేశినేని చిన్ని భరోసా ఇచ్చారు. రాజధాని అమరావతికి నిధులు రాకుండా వైసీపీ బ్యాచ్ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రానికి, నిరుద్యోగ యువతకు నష్టం చేసే పనులను మానుకోవాలి’’ అని కేశినేని చిన్ని పేర్కొన్నారు. రాజకీయంగా ఏదైనా చేయాలనుకుంటే నన్ను చేయండి కానీ పెట్టుబడిదారులను భయపెట్టి నాపై బురద చల్లాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/liquor-scam-25-196900.html
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది