మంత్రిని నిలదీసిన మహిళపై మద్యం కేసు!

Publish Date:Jul 18, 2022

Advertisement

రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. ఇప్పుడు జగన్ సర్కార్ తలచుకుంటే కేసులకు కొదవా అని ఆ సామెతను మార్చుకోవలసిన పరిస్థితి ఏపీలో ఉంది. విపక్ష నేతలు, సొంత పార్టీ ఎంపీ.. సామాన్యులు, మాన్యులు అన్న తేడా లేదు. సర్కార్ ను విమర్శించినా, ప్రశ్నించినా కేసులు పెట్టడానికి పోలీసులు రెడీ అయిపోతుంటారు. కేసు పెట్టినా పెట్టకున్నా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి కూర్చోబెడతారు. అక్కడ నుంచి రాయబారాలు, హెచ్చరికలు, బెదరింపులు. అవేవీ ఫలించకపోతే.. ఇక కేసు పెట్టి జైల్లో తోయడమే.  జగన్ సర్కార్ ను ఎదిరించినా, నిలదీసినా ఇక అంతే సంగతులు. అలా సర్కార్ ను నిలదీసిన వారు విపక్ష నేతలైనా, సామాన్య జనులైనా వారిని వెంటాడి వేధించడం ఏపీలో షరా మామూలే అన్నట్లుగా తయారైంది. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సంగతి తీసుకున్నా, ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడైనా, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే అంకెలు కూడా సరిపోవు. అంతెందుకు ప్రభుత్వ విధానాలను విమర్శించిన సొంత పార్టీ ఎంపీపై కూడా కేసులు పెట్టి వేధించిన చరిత్ర జగన్ సర్కార్ ది. ఇప్పుడు జగన్ సర్కార్ తాజాగా నమోదు చేసిన కేసు చూస్తుంటే ఇక రాష్ట్రంలో ప్రభుత్వానికి తందానా అనకపోతే కేసులు ఎదుర్కొని జైళ్లలో కూర్చోవడం తప్ప మరో గత్యంతరం లేదా అనిపించక మానదు.

ఇంతకీ విశేషమేమిటంటే, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సత్య సాయి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి సత్యనారాయణను ఓ మహిళ నిలదీశారు. తనకు  పిఛన్ తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తన ఇంటికి రావద్దనీ, వస్తే చెప్పుతో కొడతాననీ హెచ్చరించారు. సహజమే.. ఇంత కాలం వచ్చిన పింఛన్ ను కారణం లేకుండా తీసేస్తే ప్రశ్నించడం సహజమే. ఒకింత ఆగ్రహం ఎక్కువ అయితే.. ఇంటికి రావద్దనడమూ.. ముఖం మీదే తలుపులు మూసేయడమూ, వస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించడమూ తప్పెలా అవుతుంది. ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇంటికి ఆహ్వానించడమైనా, రావద్దని అనడమైనా.. ఆ ఇంటి యజమానుల ఇష్టం. దానికి కాదనడానికి ఏ ప్రభుత్వానికీ అధికారం లేదు.

ఒక సామాన్య మహిళ జగన్ ప్రభుత్వంపై, మంత్రి శంకర నారాయణపై తన ఆగ్రహాన్ని అలా వెళ్లగక్కింది. అప్పటికి ఊరుకుని వెనుదిరిగిన మంత్రి ఆ తరువాత తన అధికార ప్రతాపాన్ని చూపారు. మంత్రిని నిలదీసిన మహిళను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. మద్యం కేసు పెట్టారని అంటున్నారు. అయితే ఆ విషయం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లడం నిజం.

ఆ తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేయడమూ నిజం. సరిగ్గా మంత్రి శంకరనారాయణను నిలదీసి ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేసిన మరునాడే పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఎస్టీ వర్గానికి చెందిన ఆ మహిళ ఒక కూలీ. కూలి పని చేసుకుని పొట్టపోసుకునే ఆమె కూలీ పనులు చేసే చోట ఓ ఇసుక దిబ్బలో కర్నాటక బ్రాండ్ మద్యం ప్యాకెట్లు  దొరికాయంటూ పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకువెళ్లారు.  

By
en-us Political News

  
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.