భలే మాంచి చౌక బేరము.. సింహాలను అతి తక్కువ ధరకు అమ్మేస్తున్న పాక్
Publish Date:Jul 30, 2022
Advertisement
పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభ తీవ్రతకు అద్దం పట్టే ఉదంతమింది. ఆ దేశంలో నిత్యావసరాలు ఆశాసానికి అంటుతున్నాయి. సామాన్య జనం బతకడానికే రోజూ లాటరీ కొట్టాల్సిన పరిస్థితి ఉందని అంతర్జాతీయ మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురిస్తోంది. ఆ దేశంలో మనుషులకే అంతటి దురవస్థ ఉంటే ఇక జంతువుల పరిస్థితి గురించి చెప్పనే అక్కర్లేదు. అందులోనూ జంతు ప్రదర్శన శాలలను ఎలా నిర్వహిస్తున్నారు. అందులోని వన్య ప్రాణులకు తిండి ఎలా పెడుతున్నారు అన్న సందేహం రాక మానదు. ఆ సందేహానికి వాళ్లేం చేస్తున్నారో తెలిస్తే సమాధానం దొరుకుతుంది. జూలో జంతువులను అయిన కాడికి అమ్మేస్తున్నారు. ఔను ఇది నిజం. పత్రికలలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి మరీ విక్రయాలు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు వచ్చి జంతువులను కొనుక్కోండొహో అని చాటింపూ వేస్తున్నారు. ఇందుకు లాహోర్ లోని ఓ జూ ఇచ్చిన ప్రకటనే ప్రత్యక్ష సాక్ష్యం లాహోర్ లో లయన్ సఫారీ జూ ఉంది. అది 142 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 40 సింహాలూ, ఇతర వన్య ప్రాణులూ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ జూ నిర్వహణ కష్టం అవ్వడంతో జూలో జంతువులు ఆకలితో అలమటించి ప్రాణాలు కొల్పోయే పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ జూ సింహాలను విక్రయానికి పెట్టింది. వాటి విక్రయంతో వచ్చిన సొమ్ముతో కనీసం ఇతర వన్య ప్రాణులనైనా బతికించుకోవచ్చని తలపోసింది. వెంటనే ఆచరణలో పెట్టేసింది. జూలోని మొత్తం సిహాలలో 15 సింహాలను విక్రయించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఒక్కో సింహం ధర 1.5లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఈ ధర పాకిస్థాన్ లో గేదెల ధర కంటే తక్కువ. దీంతో పలువురు సంపన్నులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
http://www.teluguone.com/news/content/lions-for-sale-in-pakistan-sa-cheap-as-one-and-half-lac-rupees-39-140869.html





