ఈ శాంతి రేఖ.. పెనుముప్పునకు సంకేతమేనా?

Publish Date:Apr 18, 2026

Advertisement

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం కనిపిస్తున్న శాంతి ప్రయత్నాలు అత్యంత సున్నితమైన దశలో ఉన్నాయి. ఇప్పుడున్న ప్రశాంతతను శాశ్వత శాంతిగా భావించడం కంటే, ఒక పెద్ద ప్రమాదానికి ముందు దొరికిన చిన్న విరామంగానే అంతర్జాతీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. సైనిక పరంగా పరస్పరం పైచేయి సాధించాలనే పట్టుదల, దేశీయంగా తమ ప్రతిష్టను కాపాడుకోవాలనే రాజకీయ నాయకత్వాల ఆకాంక్ష, అగ్రరాజ్యాల వ్యూహాత్మక ప్రయోజనాలు ఈ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ మూడు అంశాల ఒత్తిడి వల్ల ప్రస్తుతం జరుగుతున్న శాంతి ప్రయత్నాలు ఏ క్షణమైనా నీరుగారిపోయే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్,  లెబనాన్ సరిహద్దుల్లో అమలులోకి వచ్చిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒక ఆశావహ పరిస్థితిని ఆవిష్కరించినప్పటికీ, ఇది కేవలం ఒక చిన్న రాజకీయ అవకాశంగానే కనిపిస్తోంది తప్ప ఉద్రిక్తతలను చల్లార్చే శాశ్వత పరిష్కారంగా ఎంత మాత్రం స్థిరపడే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

హిజ్బుల్లా వద్ద ఉన్న డ్రోన్లు, రాకెట్ల సామర్థ్యం, అలాగే ఇజ్రాయెల్  ఉత్తర సరిహద్దు భద్రత విషయంలో పడుతున్న ఆందోళనలు ఈ సంధి ద్వారా పరిష్కారం కాలేదు. కాలేవు. దౌత్యపరమైన చర్చలకు కొంత సమయం దొరికిన మాట వాస్తవమే అయినా, ఇరుపక్షాల సైనిక సమీకరణల్లో గానీ, వారి యుద్ధ ఉద్దేశాల్లో గానీ ఎటువంటి మార్పు రాలేదని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ఒక ఎత్తుగడలో భాగంగా తీసుకున్న విరామమే తప్ప, శాశ్వత పరిష్కారం కాదని క్షేత్రస్థాయి పరిస్థితులును గమనిస్తే విస్పష్టంగా అవగతమౌతుంది. 

ఇక మరోవైపు, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగానే కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుతం పాత అణు ఒప్పందం కంటే..  కొన్ని మినహాయింపులతో కూడిన మధ్యంతర ఒప్పందానికి మొగ్గు చూపుతోంది. ఆర్థికంగా ఊపిరి పీల్చుకోవడానికి ఆంక్షల సడలింపు కోరుకుంటూనే, తన అణు కార్యక్రమాలను పూర్తిగా వదులు కోవడానికి సిద్ధంగా లేదన్న సంకేతాలిస్తోంది. అయితే..  అమెరికా ఒకవైపు చర్చల తలుపులు తెరిచి ఉంచుతూనే, మరోవైపు సైనిక చర్య ఆప్షన్ సిద్ధంగా ఉందని ప్రకటించడం ఇరు దేశాల మధ్య విశ్వాసలేమిని సూచిస్తోంది.   ఈ  ట్రస్ట్ డెఫిసిట్ .. అంటే విశ్వాసలేమి  కారణంగా చర్చల టేబుల్ మీద కూడా యుద్ధపు నీడల పడగలు  కనిపిస్తున్నాయి. 

ఈ మొత్తం సంక్షోభంలో హోర్ముజ్ జలసంధి ఇరాన్ చేతిలో ఒక శక్తివంతమైన అస్త్రంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని అడ్డుపెట్టుకుని ఇరాన్ తన వ్యూహాలను రచిస్తోంది. నౌకల రాకపోకలకు స్వేచ్ఛ ఉంటుందని చెబుతూనే, కొన్ని షరతులను జోడించడం ద్వారా అమెరికా మరియు గల్ఫ్ దేశాలపై ఒత్తిడి పెంచుతోంది.  ఈ ప్రాంతంలో చిన్నపాటి అలజడి రేగినా ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. తద్వారా తనపై ఒత్తిడి పెంచితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాననే బలమైన  హెచ్చరిక ఇరాన్ చేస్తున్నది. 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ ప్రయోజనాల కోసం సమయ కొనుగోలు  ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ తన భద్రతను కాపాడుకుంటూనే..  ప్రజల ముందు బలహీనంగా కనిపించకూడదనే ఒత్తిడిలో ఉంది. అమెరికా యుద్ధాన్ని నివారించాలని చూస్తున్నా, తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని తాపత్రేయపడుతోంది. లెబనాన్ వంటి దేశాలు తమ భూభాగం రణరంగం కాకూడదని కోరుకుంటున్నాయి.  హిజ్బుల్లా వంటి గ్రూపులపై వాటికి పూర్తి నియంత్రణ లేదు. ఇలాంటి భిన్నమైన అజెండాలు,  గందరగోళ  ప్రకటనల వల్ల క్షేత్రస్థాయిలో  ఉన్న సైనిక కమాండర్లు తప్పుడు అంచనాలు వేసే అవకాశం ఉంది. చిన్న పొరపాటు జరిగినా అది మహా యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. తాత్కాలిక విరామం.. పెను ఉత్పాతానికి దారితీసే ప్రమాదం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

-సీతారామ కంఠమనేని

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.