జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని.. లూద్రా

Publish Date:Sep 11, 2023

Advertisement

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలసిందే. శుక్రవారం (సెప్టెంబర్ 9)అర్ధరాత్రి దాటిన తరువాత నెల్లూరులో ఆయనను నిర్బంధంలోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు  శనివారం (సెప్టెంబర్ 10)తెల్లవారు జామున అరెస్టు చేసినట్లు ప్రకటించి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఆదివారం(సెప్టెంబర్ 10) రాత్రి వరకూ విచారణ, వైద్యపరీక్షలు, కోర్టులో వాదనల అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.  దీంతో ఆదివారం (సెప్టెంబర్ 10) రాత్రి ఆయనను విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.  కోర్టు ఆదేశాల మేరకు   ప్రత్యేక గదిని కేటాయించారు. ఇక జైలు అధికారులు చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. దీంతో 45 ఏండ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలి సారిగా  జైలుకు వెళ్లినట్లైంది.  జైలులో  చంద్రబాబుకు ఐదుగురు సిబ్బందితో భద్రతా కల్పించారు. అంతే కాకుండా జైల్లో ఆయనకు ఓ వ్యక్తిగత సహయకుడు ఉండేందుకు కూడా అనుమతి ఇచ్చారు. అలాగూ జైల్లో చంద్రబాబుకు ఇంటి నుంచి అల్ఫాహారం, భోజనం, మెడిసన్‌కు అనుమతి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అవకాశం కల్పించారు.  చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే రాజమహేంద్రవరంలో సెక్షన్ 30 ఆంక్షలను విధించారు. సోమవారం (సెప్టెంబర్ 11) జైలు ఆవరణలోనే చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ కు ఎదురుగా ఉన్న జైలు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి ములాఖత్ ద్వారా కలిశారు. అదలా ఉండగా  జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ఆయన తరఫు న్యాయవాది  లూద్రా పేర్కొన్నారు. సోమవారం (సెప్టెంబర్ 11) ఆయన  ఏసీబీ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా హైకోర్టులో కూడా చంద్రబాబు బెయిలు కోసం హైస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  
అదలా ఉండగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో  సీఐడీ తరఫున వాదించిన  సిఐడి తరఫున  వాధించిన న్యాయవాది సుధాకర్ రెడ్డి కి 4+4 గన్ మన్ లతో తో భద్రత  కల్పిస్తూ జగన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.  

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.