దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇక లేరు

Publish Date:Jun 9, 2026

Advertisement

చలనచిత్ర రంగంలో, ముఖ్యంగా దక్షిణాది సినిమాలలో అద్భుత దర్శకుడిగా గుర్తింపు పొందిన భారతీరాజా కన్నుమూశారు. ఆయన వయస్సు 84 ఏళ్లు.  గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో బుధవారం (జూన్ 10) ఉదయం తుదిశ్వాస విడిచారు.  దక్షిణాది సినిమాల కొత్త ట్రెండ్‌ సెట్ చేసిన దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా  మరణవార్త వినగానే   సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.  

గత ఏడాది మార్చిలో  భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా  గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆ పుత్రశోకం భారతీరాజాను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. అప్పటినుంచి ఆయన వయోభారంతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. గత కొన్ని నెలలుగా పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినప్పటికీ..  పరిస్థితి విషమించడంతో బుధవాంరం (జూన్ 10) ఉదయం ఆయన కన్నుమూశారు.

1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం అనే పల్లెటూరిలో  జన్మించిన భరతీరాజా అసలు పేరు చిన్నసామి. సినిమాపై ఉన్న ఆసక్తితో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. 1977లో వచ్చిన '16 వయతినిలే' అనే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. అంతవరకు స్టూడియోల నాలుగు గోడల మధ్య, సెట్టింగుల మధ్య నడిచే సినిమాలను ఈ సినిమాతో ఆయన ఒక్కసారిగా అవుట్‌డోర్‌కు, అచ్చమైన పల్లెటూరి వాతావరణంలోకి తీసుకెళ్లారు.   శ్రీదేవి, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్‌కు ఈ సినిమా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'పదహారేళ్ల వయసు' పేరుతో రీమేక్ చేయగా ఇక్కడా ఘన విజయం సాధించింది. 

భారతీరాజా కేవలం తమిళ చిత్రపరిశ్రమకే  పరిమితం కాలేదు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాలను అందించారు.  తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన  సీతాకోకచిలుక' చిత్రం ఒక సంచలనం. ఈ సినిమాకు గాను ఆయనకు జాతీయ పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా లభించింది. అలాగే.. చిరంజీవి హీరో  ఆరాధన,  కృష్ణ హీరోగా జమదగ్ని చిత్రాలకు ఆయనే దర్శకుడు. అలాగే.. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ అయిన  మంగమ్మ గారి మనవడు చిత్రానికి మూలకథ అందించింది కూడా భారతీరాజాయే. అలాగే 1994లో వచ్చిన  పల్నాటి పౌరుషం' సినిమాకు ఆయనే స్క్రీన్‌ప్లే అందించారు.  

దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా భారతీరాజా తనదైన ముద్ర వేశారు. మణిరత్నం దర్శకత్వం వహించిన  ఆయుధ ఎళుతు  (తెలుగులో  యువ) చిత్రంలో ఆయన పోషించిన రాజకీయ నాయకుడి పాత్ర అందరినీ మెప్పించింది. అలాగే  కార్తీక్, రాధ, రేవతి వంటి ఎందరో నటీనటులను, సాంకేతిక నిపుణులను వెండితెరకు పరిచయం చేశారు భారతీ రాజా. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన దాదాపు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారతీయ చలనచిత్ర రంగానికి భారతీరాజా చేసిన అసమాన సేవలకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన్ను ఎన్నో అవార్డులతో సత్కరించాయి

By
en-us Political News

  
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27, ఈ30 రకాలు వస్తాయి. ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్‌ దేశాల్లో బాలకృష్ణ అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్ లభించాయి.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్‌షిప్‌ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ కాంగ్రెస్ ఆరోపించింది.
సంక్షేమ పథకాలతో అనర్హులు ఎలా లబ్ధి పొందుతున్నారన్నది వివరిస్తూ.. గృహలక్ష్మి పథకం కింద కొన్నిచోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేరుతో ఇప్పటికీ డబ్బులు డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. మరణించిన వారి బ్యాంక్ ఖాతాలకు వేరే మొబైల్ నంబర్లను లింక్ చేసి, భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ. ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మోసాలను అరికట్టి నిజమైన పేదలకు న్యాయం చేయడానికే ఈ వెరిఫికేషన్ అని వివరించారు.
ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు.ఆదివారం సాయం త్రం నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 18 కేసులు నమోదవగా, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే యువతులే అతని మోసానికి ఎక్కువగా బలైనట్లు విచారణలో తేలింది.
భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ, అప్రతిహత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర లిఖించినందుకు మోదీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
సమావేశం ప్రారంభానికి ముందే పవన్ కల్యాణ్ ప్రధాని మోడీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలందిస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీహార్‌కు చెందిన అనిల్ కుమార్, మీనా దేవి దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి బొల్లారంలోని బీహార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ లేబర్ కాంట్రాక్టర్ పని చేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అనిల్ కుమార్, మీనాదేవి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఏపీ రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యంత ఆధునిక నివాస సముదాయాల నిర్మాణానికి ఏకంగా 1,234.91 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
రాష్ట్రంలో మహిళల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు తమిళనాడు వ్యాప్తంగా హైటెక్ డ్రోన్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. తమిళనాడు చరిత్రలోనే ఇటువంటి ఒక అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థను మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనీ, పలు చోట్ల పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.