అమరావతికి చట్టబద్ధత.. ఢిల్లీలో చక్రం తిప్పిన నారా లోకేష్

Publish Date:Apr 12, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహానికి కారణమైంది. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కేంద్రం నిర్ణయం వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ఇక అమరావతి అభివృద్ధి వాయువేగంతో సాగుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చింది. అయితే కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.  

గతంలో ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పేవారు. ఇప్పుడు ఆ కీలక భూమిక లోకేష్ పోషిస్తున్నారన్నది రాజకీయవర్గాలలో టాక్.  అమరావతికి సంబంధించిన కీలక అనుమతులు సాధించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ,  ఢిల్లీ వేదికగా ఎన్డీయే కూటమిలోని కీలక నేతలను, ఎంపీలను సమన్వయం చేస్తూ అమరావతి ఆవశ్యకతను వివరించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారనీ అంటున్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తూ అమరావతికి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించేలా చేశారనని చెబుతున్నారు.  
 అమరావతికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం, లోకేష్ మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటన లోకేష్ రాజకీయ పరిణతికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారిస్తుండగా, జాతీయ స్థాయిలో పార్టీ గళాన్ని వినిపించడం, రాష్ట్రప్రయోజనాల సాధనకు కృషి చేయడం వంటి  బాధ్యతను లోకేష్ భుజాన వేసుకున్నారని అంటున్నారు. 

రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణతో పాటు, కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాల విషయంలోనూ లోకేష్ వరుసగా జాతీయ నాయకులను కలుస్తున్నారు. తండ్రి నారా చంద్రబాబు రాజకీయ వారసత్వాని అందిపుచ్చుకుంటూనే.. అదే సమయంలో   రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధిస్తున్నారని చెబుతున్నారు. లోకేష్ చొరవతో అమరావతికి మార్గం సుగమం కావడమే కాకుండా, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలే అంటున్నాయి.  

By
en-us Political News

  
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.