పిల్లవాడిని వదిలి వెళ్తున్నారా!

Publish Date:Jul 28, 2016

Advertisement

 

ఇంట్లో పిల్లలని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే ఎవరికి మాత్రం మనసు వస్తుంది. కానీ అనుకోకుండా ఓసారి ఏదన్నా ఆఫీసు పని మీదో, ఎవరినన్నా పరామర్శించడానికో పిల్లలని ఇంట్లోనే వదిలి వెళ్లాల్సి రావచ్చు. అందులోనూ పాపో, బాబో ఒక్కరే ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. బయటకు వెళ్తామన్న మాటే కానీ మనసంతా వారి క్షేమం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అలజడిని పూర్తిగా అడ్డుకోలేకపోవచ్చు కానీ, ఇంట్లో పిల్లలను వదిలి వెళ్లేటప్పుడు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక వారి క్షేమానికి గ్యారెంటీ ఇచ్చినట్లే అంటున్నారు పెద్దలు.

 

అందుబాటులో ప్రాణాంతకాలు

చాలా ఇళ్లల్లో కత్తెర, చాకు, లైటరు, అగ్గపెట్టె.... లాంటి వస్తువులన్నీ ఎక్కడపడితే అక్కడ పడేసి ఉంటాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీటిని చేజిక్కించుకున్న పిల్లలకి వాటితో ఏదన్నా సాహసం చేయాలన్న సరదా పుట్టడం సహజమే! అలాంటి సాహసాలే ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లే ముందు ఒకసారి అలా ఇంట్లో కలియతిరగండి. ఇలాంటి వస్తువుల ఏమన్నా ఉంటే లోపల పడేయండి. గ్యాస్ స్టవ్‌ కట్టేసి ఉందా లేదా! గీజర్‌ వంటి వస్తువులు ఏవన్నా ఆన్‌లో ఉన్నాయేమో ఓసారి చూసుకుని బయల్దేరండి.

 

ఫోన్‌ నెంబర్లు

ఇంట్లో పిల్లలకి, తల్లిదండ్రులు ఫోన్‌ నెంబర్లు గుర్తుంచుకునేలా చేయడం చాలా అవసరం. వీటిని బట్టీ పట్టించడంలో ఏ తప్పూ లేదు సరికదా, ఒకోసారి అ నెంబర్లే పిల్లవాడని ప్రమాదం నుంచి కాపాడవచ్చు కూడా! కాబట్టి అవసరం అయినప్పుడు మీ నెంబరుకి ఫోన్‌ చేయమని పిల్లవాడికి చెప్పి ఉంచండి. చాదస్తం అనుకోకుండా పోలీస్‌, ఫైర్‌, ఆంబులెన్స్‌ వంటి సర్వీసులకు సంబంధించిన నెంబర్లను కూడా అతనికి చెప్పి ఉంచండి.

 

అపరిచితులకు నో ఎంట్రీ!

మరీ సన్నిహితులైతే ఇంటి తలుపులను బార్లా తెరిచి ఆహ్వానించకూడదన్న జాగ్రత్త పిల్లలకు అందించాలి. గ్రిల్స్‌ మాటు నుంచో, డోర్‌ చెయిన్ వెనుక నుంచో సమాధానం చెబితే సరిపోతుంది. వచ్చినవాళ్లు మరీ తమకి కావల్సిన జవాబుల కోసం పట్టుబడితే, మీకు ఫోన్‌ చేయమని సూచించండి. ఎవరూ లేని సమయంలో మొహమాటానికి పోయి, అపరిచితులను లోనికి రానిస్తే ఉపయోగం కాదు కదా ప్రమాదానికే అవకాశాలు ఎక్కువ.

 

గమనించేందుకు ఎవరన్నా...

పిల్లలని ఒంటరిగా వదిలి వెళ్తున్న విషయం పొరుగువారికి తెలియచేసి, అప్పుడప్పుడూ కాస్త గమనించమని అభ్యర్థించడం మంచిది. దాని వల్ల వాళ్లూ కాస్త ఇంటిని గమనిస్తూ ఉంటారు, పిల్లలకూ తాము బుద్ధిగా మసలుకోవాలన్న జాగ్రత్తా ఉంటుంది. ఒకవేళ అలా కుదరని పక్షంలో మనమే మధ్యలో ఒకసారి ఇంటికి ఫోన్‌ చేసి పిల్లవాడు ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడేమో విచారిస్తే సరి!

 

ఏదన్నా వ్యాపకం...

పిల్లలకు ఏదన్నా వ్యాపకాన్ని అందించి వెళ్తే వాళ్ల మనసు ఇక అటూ ఇటూ చెదరదు. ఒక ప్రాజెక్టువర్కో, పుస్తకమో, పిల్లల సినిమానో... ఇలా అతని ఏకాగ్రతని ఆకర్షించే పని ఏదాన్నా కల్పించి వెళ్తే మంచిది. ఇక వీలైతే అతని స్నేహితుని కూడా పిలుచుకొమ్మని చెబితే అటు కాలక్షేపానికీ, ఇటు భద్రతకీ లోటు ఉండదు.

 

- నిర్జర.

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.