భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదీ.. బ్రిటన్ నుంచి నేర్చుకోండి.. బీజేపీకి కాంగ్రెస్ హితవు

Publish Date:Oct 26, 2022

Advertisement

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రుషి సునాక్ బాధ్యతలు చేపట్టడంపై దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో భారత్ బ్రిటన్ ను చూసి ఓంతో నేర్చుకోవాలంటూ హితవులూ వినవస్తున్నాయి.  విదేశీ మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని పదవిని అధిష్టించినందుకు ఆనందంతో పొంగిపోతున్న ఈ నేతలే గతంలో సోనియా గాంధీ  భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిన సమయంలో ఎందుకు అడ్డుకున్నారన్న ప్రశ్న సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. విదేశీ వనిత అంటూ.. అప్పట్లో బీజేపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలు.. ఆమె ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపడితే గుండు చేయించుకుంటానంటూ సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి.

భారత సంతతికి చెందిన రుషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయితే హర్షాతి రేకలు వ్యక్తం చేస్తూ ఆయనతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానంటూ ప్రధాని మోడీ ఆకాంక్షించారు.  అయితే అప్పట్లో విదేశీ వనిత అంటూ సోనియా గాంధీ  అత్యున్నత పీఠం అధిష్టించకుండా బీజేపీ నేతలు అడ్డుకోవడాన్ని ఎలా సమర్ధించుకుంటారని కాంగ్రెస్ ఇప్పుడు నిలదీస్తోంది. అలాగే విదేశీ మూలాలున్న సోనియా ప్రధాని పదవికి అనర్హురాలంటూ అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి శరద్ యాదవ్ సొంత కుంపటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని ప్రారంభించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అలాగే విదేశీ మూలాలున్నరుషి సునక్ బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతించిన ఎంఐఎం.. భారత్ కు హిజాబ్ ధరించిన మహిళను ప్రధానిగా చూడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

కర్నాటకలో త్వరలో జరగనున్నముసినిపల్ ఎన్నికల కోసం బీజాపూర్ లో నిర్వహించిన ప్రచార సభ  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగానే ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ కూడా దీటుగా స్పందించి తాము హిజాబ్ ధరించిన మహిళను ఎంఐఎం అధినేత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది.    ఇక ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి  మెహబూబా ముఫ్తి   బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునక్ అభినంద‌న‌లు తెలుపుతూనే..  బీజేపీపై విమ‌ర్శ‌ల వర్షం కురిపించారు.  

బ్రిట‌న్ ఒక  మైనారిటీ స‌భ్యుడిని ప్ర‌ధాని మంత్రిగా అంగీక‌రించింద‌నే విష‌యాన్ని బీజేపీ గుర్తించాలని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్  భార‌త్ లో   ఎన్నార్సీ, సీఏఏ వంటి విభ‌జ‌న‌, వివ‌క్షాపూరిత  చట్టాల‌తో ప్రజలకు సంకెళ్లు వేసి మరీ విద్వేషాన్ని నింపుతోందని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అయితే సునాక్ కు అభినందనలు తెలుపుతూనే బీజేపీపై విమర్శల తూటాలు పేల్చింది. మొదట కమలా హ్యారిస్‌, ఇప్పుడు రిషి సునాక్‌.. యూఎస్‌, యూకేలోని ప్రజలు నాన్‌ మెజార్జీ పౌరుల్ని అక్కున్న చేర్చుకుని.. ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు.   ఈ పరిణామం నుంచి భారత్‌.. ప్రత్యేకించి అత్యధిక జనాభా సిద్ధాంతాన్ని అవలంబించే పార్టీలు.. పాఠం నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానిస్తే.. పార్టీ  అధికార ప్రతినిథి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఒక అడుగు ముందుకు వేసి భిన్నత్వంలో ఏకత్వం మన డీఎన్ఏలోనే ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు.. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో బ్రిటన్ ను చూసి భారత్ నేర్చుకోవాల్సి ఉందని బీజేపీకి చురకలు వేశారు.

ఇక మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ సైతం యూకేలో జరిగినది అరుదైన పరిణామమన్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అత్యున్నత, అత్యంతశక్తిమంతమైన పదవిలో కూర్చోబెట్టారనీ, భారత్ లో అలా ఎన్నటికీ జరిగే అవకాశం లేదనీ పేర్కొన్నారు.  

By
en-us Political News

  
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.