కేసీఆర్ పై పోటీకి రె‘ఢీ’అంటున్ననేతలు

Publish Date:May 5, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? జాతీయ రాజకీయాల్లో  కీలక  పాత్రను పోషించేందుకు వీలుగా ...లోక్ సభకు పోటీచేస్తారా? లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, హ్యాట్రిక్ ముచ్చట తీర్చుకుంటారా? లోక్ సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి ఢిల్లీకి మకాం మారుస్తారా? అసెంబ్లీకి పోటీచేసే పక్షాన గజ్వేల్ నుంచే పోటీ చేస్తారా? సిద్దిపేట లేదా మరో  నియోజక వర్గం నుంచి బరిలో దిగుతారా? ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై వ్యూహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. 

అయితే నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్  రేపు ఏమి చేస్తారు, అనేది ఈరోజు ఊహించడం సాహసమే అవుతుంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహ రచనలో ఆయన ప్రత్యర్ధి పార్టీల నాయకులకే కాదు సొంత పార్టీ, సొంత గూటి నేతలకు  కూడా చిక్కరు.. దొరకరు. నువ్వుకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు అన్నట్లుగా ఆయన ప్రత్యర్ధులు ఒకటి ఉహిస్తే, ఆయన ఇంకొకటి చేసి  ప్రత్యర్ధులను ఇట్టే బురిడి కొట్టిస్తారు. ఆ విషయంలో ఆయన చాలా చాలా సమర్ధులు. సో  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..ఉహకు అందని సందేహం.  

అయితే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనపై పోటీ చేసేందుకు రె‘ఢీ’ అవుతున్న ప్రత్యర్దుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పడు మాజీ మంత్రి , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వేల్ బరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ‘ఢీ’ కొనేందుకు తాను రెడీ  అని ప్రకటించారు.

ప్రకటించడమే కాదు నియోజక వర్గంలో కొంత హడావిడి కూడా చేశారు. అప్పట్లో స్వయంగా ఆయనే పబ్లిక్ గా సవాల్ విసిరారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పానని తెలిపారు. అంతే కాదు, ఆయన పశ్చిమ బెంగాల్ తో పోలిక కూడా తెచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని అదే విధంగా ఇక్కడ తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడిస్తానని ధీమా వ్యక్త పరిచారు. అలాగే  మరో బీజేపీ ఎమ్మెల్యే, రఘునందన రావు కూడా పార్టీ ఆదేశిస్తే, ముఖ్యమంత్రి పై పోటీ చేసేందుకు తాను సిద్దమని టీవీ డిబేట్స్ లో ప్రకటించారు.  

అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, విప్లవ గాయకుడు గద్దర్  బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కేసీఆర్ టార్గెట్ గా గజ్వేల్ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు. రెండు మూడు రోజుల క్రితమే గద్దర్  స్వయంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని తెలిపారు. అయితే  ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేక ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆరే వ్యూహాత్మకంగా ఆయన్ని బరిలో దించుతున్నారా,అనే అనుమానాలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. 

గద్దర్ విషయం ఎలా ఉన్నా  తాజాగా బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై పోటీ చేసేందుకు తాను సైతం సిద్ధమని అన్నారు.గురువారం (మే 4)బీజేపీ చేరికల కమిటీ చైర్మన్  ఈటల రాజేందర్, ఇతర బీజేపీ నాయకులు ఖమ్మంలో  పొంగులేటి నివాసంలో ఆయనతో పాటు మరో  బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావుతో సమావేశమయ్యారు. బీజేపీ నేతలు ఆ ఇద్దరినీ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి, బీజేపీలో చేరే విషయంలో స్పష్టత ఇవ్వక పోయినా గజ్వేల్ లో కేసిఆర్ పై పోటీకి కూడా వెనకడేది లేదని అన్నారు. అలాగే, కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని అందుకోసం అవసరం అయితే రెండు మెట్లు దిగేందుకు కూడా సిద్దమని ప్రకటించారు. 

అదెలా ఉన్నప్పటికీ, ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళతారా? అనే విషయంలో స్పష్టత లేదు,  ఆలాగే ఆయన  ఎక్కడి  నుంచి పోటీ చేస్తారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు, కానీ, ఆయనతో ‘ఢీ’అనేదుకు రెడీ అవుతున్న నాయకుల నెంబర్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది.

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.