భూమన కబ్జానుంచి రూ. వంద కోట్ల విలువైన భూమికి విముక్తి.!

Publish Date:Jul 23, 2026

Advertisement

టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు, భూమన కరుణాకర్‌రెడ్డికి ఏపీ  ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో   అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన ఆయన సాగించిన భూ ఆక్రమణలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు  విలువైన ప్రభుత్వ,  ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు.  భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన  ఈ భూములు  మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.  

 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది. ఆ సమయంలో తిరుపతి  ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తిరుపతికి సమీపంలోని తిరుచానూరు, మంగళం, చిగురువాడ గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములను, రైతులకు చెందిన స్థలాలను ఆక్రమించినట్లు  విచారణలో తేలింది.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూమన ఆక్రమణలపై విచారణకు ఆదేశించింది.  ఆ ఆదేశాల మేరకు విచారించిన విజిలెన్స్ అధికారులు..  క్షేత్రస్థాయిలో రికార్డులను, సర్వే నంబర్లను నిశితంగా పరిశీలించి ఆక్రమణలు జరిగాయని నిర్థారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 

ఆ నివేదిక మేరకు మంగళం ప్రాంతంలో దశాబ్దాలుగా స్థానిక రైతులు పశువుల మేత కోసం ఉపయోగించుకుంటున్న సుమారు ఏడున్నర ఎకరాల అనాధీనం, మందబయలు భూములను భూమన ఆక్రమించారు. ఈ భూములమార్కెట్ విలువ  0 కోట్లకు పైగా ఉంటుంది. అలాగే..  మరో  ఐదెకరాల ప్రభుత్వ భూమిని కూడా భూమన కబ్జా చేసినట్లు విజిలెన్స్ విచారణ ఆధారాలతో సహా నిర్ధారించింది.  మంగళం  గ్రామంలోని సర్వే నంబరు 47/1 పరిధిలోని 5.10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, అలాగే సర్వే నంబరు 47/5 లోని 3.07 ఎకరాల అనాధీనం స్థలాన్ని భూమన కబ్జా చేసి వినియోగించుకున్నట్లు విచారణలో  బయటపడింది. 

ఇంకా.. స్థానిక భూ యజమానులను భయాందోళనలకు గురిచేసి ప్రైవేటు ఆస్తులను సైతం భూమన కబ్జా చేసినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. సర్వే నంబరు 47 పరిధిలో ఒక  భూ యజమానిని బెదిరించి, సుమారు 3.07 ఎకరాల  స్థలాన్ని  స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. విజిలెన్స్ సమర్పించిన ఆధారాలతో స్పష్టత రావడంతో..  రెవెన్యూ యంత్రాంగం, పోలీసు బలగాలు సంయుక్తంగా క్షేత్రస్థాయి చర్యలకు దిగాయి. మంగళం గ్రామంలోని 47/1 సర్వే నంబరు పరిధిలోని 5.10 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మించిన తాత్కాలిక కట్టడాలను జెసిబిలతో కూల్చివేసి, ఆ స్థలం ప్రభుత్వానిదేనంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు.

అలాగే.. సర్వే నంబరు 47/5 లో ఉన్న 3.70 ఎకరాల భూమిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిలో అక్రమంగా వరి పంటను సాగు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న ప్రతి భూమి వద్ద రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేస్తూ, ఈ ఆస్తులపై ఎవరైనా హక్కులు కోరినా,  తిరిగి ఆక్రమణలకు పాల్పడినా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని   హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను, దేవాలయం,  ఇనాం స్థలాలను ఆక్రమణదారుల నుంచి విముక్తి చేయడం స్థానికుల నుంచి హర్షం వ్యక్త మౌతోంది.  
అదలా ఉంటే..    భూ ఆక్రమణల వ్యవహారంలో భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన అధికారులపై, ఇతర నేతలపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

Bhumana Karunakar Reddy, Land encroachments,  Recovery, Encroached land Tirupati, Seizure of lands  Mangalam

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.