Publish Date:Jul 24, 2024
ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్యంతో పోరాటం చేస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న లాలు ప్రసాద్‌కి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. సోమవారం వరకు లాలు పాట్నాలోనే వున్నారు. ఆయన అనారోగ్యం తిరగబెట్టడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీకి తరలించారు. బిహార్‌లో జరిగిన దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆయన, ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్ మీద వున్నారు. లాలు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందన్న అనుమానాలు కలుగుతూ వుండటంతో ఆయన కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రిలోనే వున్నారు. లాలు స్పృహలోనే వున్నారు. ఒక సందర్భంలో కుటుంబ సభ్యులతో ‘ఇక చాలు.. చాలా అలసిపోయాను’ అని లాలు అన్నట్టు తెలుస్తోంది.
లాలు ప్రసాద్ ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తున్నారు. రెండేళ్ళ క్రితం సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నారు. లాలు కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నీ దానం చేశారు. కిడ్నీ మార్పిడి తర్వాత లాలు కోలుకున్నట్టే కనిపించారు. తనదైన శైలిలో మీడియాతో కూడా మాట్లాడేవారు. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్యం తిరగబెట్టింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lalu-prasad-yadav-health-condition-25-181400.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.