లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ?!

Publish Date:Sep 6, 2023

Advertisement

ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు  రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ముందస్తు లేకపోయినా ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడింది.  ఎన్నికలకు ఇంకా  ఏడెనిమిది నెలల సమయం మాత్రమే  ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో దిగి ప్రత్యక్ష యుద్ధం మొదలు పెట్టాయి. అధికార పార్టీ కూడా ఒకవైపు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. ఇలాంటి తరుణంలో కొందరు సీనియర్ నేతలు మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది. అలాంటి వారిలో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ కూడా ఒకరు. ప్రత్యక్ష రాజాకీయాలతో పాటు ఎన్నికల సర్వేలు నిర్వహించి తన ఫలితాలతో తెలుగు రాష్టాల ప్రజలకు బాగా సుపరిచితుడైన లగడపాటి ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

విజయవాడ  ఎంపీగా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.  2004 ఎన్నికలకు ముందు వైఎస్‌ తో కలసి రాష్ట్రమంతా పాదయాత్ర చేసినవారిలో లగడపాటి కూడా ఒకరు.  ఆ తర్వాత వైఎస్ కోటరీలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన లగడపాటికి ఆర్ధిక పుష్టి ఉండడంతో వైఎస్ 2004 ఎన్నికల్లో తొలిసారి అవకాశం ఇచ్చారు. 2004లో టీడీపీ అభ్యర్థి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ను ఓడించగా.. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసిన ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయం సాధించారు.  ఇక 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ లగడపాటి గట్టిగా పోరాడిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ తలపులు మూసి విభజన చేసిన సమయంలో లగడపాటి పెప్పర్‌ స్ప్రే చల్లారంటూ తీవ్ర ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమైనా.. లగడపాటి రాజగోపాల్ నిర్వహించే ఎన్నికల సర్వేలకు విపరీతమైన ఆదరణ ఉండేది. సొంతంగా తన టీమ్‌ ద్వారా సర్వేలు నిర్వహించే లగడపాటి చెప్పే ఎన్నికల ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఆతృతగా ఎదురు చూసేది. అయితే 2019 ఎన్నికల ముందు లగడపాటి నిర్వహించిన సర్వే ఆధారంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పారు. కానీ, అందుకు విరుద్ధంగా వైసీపీ ఘనవిజయం సాధించింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు రావడంతో ఇకపై సర్వేలు కూడా నిర్వహించనని ప్రకటించారు. అప్పటి నుండి పూర్తిగా తన వ్యాపారాలపై దృష్టి పెట్టిన లగడపాటి ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలోకి పునఃప్రవేశానికి సిద్ధమవుతున్నట్టు విజయవాడ రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఆ మాటకొస్తే గతంలో 2019 ఎన్నికల్లో కూడా లగడపాటి టీడీపీలో చేరతారని, మళ్ళీ ఆయన రాజకీయాలలోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు.

అయితే, ఈసారి ఆయన రీఎంట్రీ ఖాయమని గట్టిగా వినిపిస్తుంది. ఈ మధ్యనే విజయవాడలో రాజగోపాల్ తన మద్దతుదారులతో సమావేశమైన నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది.  త్వరలోనే విజయవాడలోని అన్ని నియోజకవర్గాల్లో లగడపాటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ నెలాఖరులో లగడపాటి సమావేశాలకి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక, ఆయన స్థానమైన విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేని నానీ ఉండగా.. వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ఇక్కడ టీడీపీ నుండి కేశినేని నానీ తమ్ముడు చిన్నీ కానీ మరో బలమైన నేతను రంగంలోకి దింపాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. వైసీపీ కూడా ఇక్కడ గట్టి అభ్యర్థి కోసం వెతుకులాడుతుంది. ఈ క్రమంలో లగడపాటి మళ్ళీ రాజకీయాలలోకి వస్తే టీడీపీలో చేరతారా? లేక వైసీపీ నుండి పోటీ చేస్తారా అన్న ఆసక్తి కలుగుతున్నది. దీంతో పాటు అసలు లగడపాటి మళ్ళీ రాజకీయాలలోకి వస్తారా? లేక గతంలో మాదిరి ఈసారి కూడా ఇది ప్రచారంగానే మిగిలిపోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.