లగడపాటికి బాలకృష్ణను విమర్శించే స్థాయి లేదు
Publish Date:Jan 25, 2012
Advertisement
విజయవాడ: లగడపాటికి హీరో నందమూరి బాలకృష్ణను విమర్శించే హక్కు గాని, స్థాయి గాని లేదని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ, జిల్లా శాసనసభ్యుడు కొడాలి నాని బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనకు దమ్ముంటే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెసు నేత నెహ్రూ తాను తెలుగుదేశం పార్టీలోకి వస్తానని మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నారని, ఐతే ఆయన మాత్రం ఒప్పుకోలేదని వంశీ మండిపడ్డారు. అందుకే నెహ్రూ చంద్రబాబుపై ఇష్టం వచ్చిన విధంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు రైతు పోరు బాట యాత్రను విమర్శించే హక్కు లేదన్నారు. రైతు బజార్లు టిడిపి హయాంలనే వచ్చాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.నెహ్రూ అలాగే మాట్లాడితే కోడిగుడ్ల సీన్ రిపీట్ అవుతుందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి మంత్రి పదవి రాకపోవడంతో నెహ్రూ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఇప్పటికైనా సంస్కారం నేర్చుకోవాలని లేదంటే టిడిపి కార్యకర్తలు బుద్ధి చెబుతారన్నారు. ముందు నీదే పార్టీయో ఎక్కడి నుండి పోటీ చేయాలో నిర్ణయించుకో కానీ టిడిపిని లక్ష్యంగా పెట్టుకోవడం మానేయమని సూచించారు.
http://www.teluguone.com/news/content/lagadapati-raj-gopal-24-11226.html





