టీడీపీలోకి లగడపాటి..!

Publish Date:Jun 16, 2023

Advertisement

విజయవాడ మాజీ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్.. రాజకీయాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుక రంగం సిద్దమైందనే ఓ చర్చ అయితే ఏపీ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఆ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి.. మళ్లీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతారని తెలుస్తోంది. అలాగే ఆయన తనయుడిని సైతం పోలిటికల్ ఎంట్రీ ఇప్పించేందుకు  ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

అయితే ప్రస్తుతం విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానికి ఆయన సోదరుడు కేశినేని చిన్నికి మధ్య పైకి కనిపించని యుద్దం జరుగుతోన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఎవరికి ఇచ్చుకున్నా తనకు అభ్యంతరం లేదని.. తాను స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగినా గెలుస్తానంటూ ఇప్పటికే కేశినేని నాని స్వయంగా ప్రకటించారనే చర్చ సైతం వైరల్ అవుతోంది. అదీకాక.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పోటీ చేస్తారనే ప్రచారం ఓ వైపు జోరుగా జరుగుతోన్నా.. అందుకు సంబంధించిన క్లారిటీ అయితే సైకిల్ పార్టీ ఇప్పటి వరకు ఇవ్వలేదని.. అయితే విజయవాడ ఎంపీ టికెట్ తన తమ్ముడు లేదా మరెవరికీ ఇచ్చినా.. కన్‌ఫార్మ్‌గా ఓడించి తీరుతానని కేశినేని నాని ఇప్పటికే మంగమ్మ శపథం స్టైల్‌లో చేశారనే ఓ ప్రచారం కూడా లోక్‌సభ పరిధిలో హల్‌చల్ చేస్తోంది.  

అలాంటి వేళ రానున్న ఎన్నికల్లో కేశినేని బ్రదర్స్‌ను పక్కన పెట్టి.. ఆ స్థానాన్ని లగడపాటి రాజగోపాల్‌కి కట్టబెట్టే అవకాశం సైతం ఉందని సమాచారం. విజయవాడ లోక్‌సభ సీటుపై గట్టి పట్టు ఉన్న నాయకులు పసుపు పార్టీలో పలువురు ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని.. ఆ క్రమంలో లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్లు అయితేనే కరెక్ట్ అనే చర్చ సైతం పార్టీలో జోరందుకొన్నట్లు తెలుస్తోంది. అదీకాక గతంలో విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందిన లగడపాటికి స్థానికంగా మంచి ఫాలోయింగే కాదు.. ఆయనకంటూ సొంత కేడర్ సైతం చాలా బలంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు లగడపాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో గెలుపొందినా.. ఆయనకు అన్ని పార్టీల నేతలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయం విదితమే. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. పాలిటిక్స్‌కి దూరం జరిగినా.. స్నేహ సంబంధాలను మాత్రం ఎక్కడా ఎప్పుడు వదలు కోలేదని ఆయన సన్నిహితులే స్పష్టంగా చెబుతుంటారు.  2004లో లగడపాటి రాజగోపాల్.. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందరు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో సైతం ఆయన నెగ్గారు. కానీ 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ క్రమంలో రాష్ట్ర విజభన బిల్లు.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు.. లగడపాటి పెప్పర్ స్ప్రే చేయడం.. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. అంతేకాదు రాష్ట్ర విజభనకు వ్యతిరేకంగా.. హైదరాబాద్ నడిబొడ్డున సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద ఆందోళనకు దిగడమే కాదు.. ఇదే అంశంపై విజయవాడలో సైతం.. ఆ మరణ నిరాహార దీక్ష చేపట్టి.. భద్రతగా ఉన్న పోలీసుల కళ్లు కప్పి.. హైదరాబాద్‌లోని నిమ్స్  ఆస్పత్రికి చేరుకున్నారు. అదే సమయంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న ప్రస్తుత ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం విధితమే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభన జరిగితే.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తానని ప్రకటించడమే కాదు.. విభజన అనివార్యం కావడంతో లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు బై బై గుడ్ బై చెప్పేసి.. తన పోలిటికల్ కేరీర్‌కి పుల్ స్టాప్ పెట్టేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన స్నేహాన్ని కొనసాగించారు. ఆ క్రమంలో 2014లో సీఎం పీఠం ఎక్కిన  చంద్రబాబుతో లగడపాటి పలుమార్లు భేటీ అయి.... విజభన హామీల కోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబుకి విన్నవించారీ లగడపాటి.   

ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ గెలవబోతోంది.. ఆ పార్టీ గెలువబోతుందంటూ ఆయన స్వయంగా సర్వేలు నిర్వహించి.. ఎన్నికల ఫలితాల ప్రకటన వెలువడక మందుకు వెల్లడించి.. ఆంధ్ర ఆక్టోపస్‌గా లగడపాటి రాజగోపాల్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే 2018 తెలంగాణ ఫలితాలు, అలాగే 2019 ఎన్నికల్లో ఆంధ్ర ఫలితాలపై ఆయన చెప్పిన ఫలితాలు తప్పు అని స్పష్టం అయింది. దీంతో ఆయన సర్వేలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వస్తున్నారీ లగడపాటి. మరీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా లగడపాటి విజయవాడ నుంచి బరిలోకి దింపితే.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఆయనపై ఎవరిని నిలబెట్టనున్నారనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ సైతం రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.