ఉప్పల్ స్టేడియంలో యువకుడిపై దాడి చేసిన లేడీ బౌన్సర్

Publish Date:May 7, 2026

Advertisement

 

ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది... ఒక యువకుడుపై దాడి చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రచ్చ రచ్చ సృష్టించింది. దీంతో బాధితుడు ఆన్లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగిన హైదరాబాద్-- పంజాబ్ మ్యాచ్ సందర్భంగా గౌతమ్ కాపర్తి (22) అనే నేను ఎల్.ఎల్.బి చదువుతున్నాను... నిన్న క్రికెట్ చూడ్డానికి ఉప్పల్ స్టేడియం వెళ్ళాను.

 సుమారు రాత్రి 8: 45 గంటల ప్రాంతంలో స్టేడియం లోపల బార్ కౌంటర్ వద్ద కూర్చొని ఉన్న సమయంలో ఓ మహిళా బౌన్సర్ తన వద్దకు వచ్చి హల్ చల్ సృష్టించింది. దీంతో నేను (గౌతం) మొదటగా ఆశ్చర్యపోయాను. అనంతరం మొబైల్ ఫోన్ తీసుకొని ఆమె ప్రవర్తనను వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించాను. అది గమనించిన లేడీ బౌన్సర్ వీడియో ఎందుకు తీస్తున్నావ్ అంటూ ఆగ్రహంతో  తనపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా తన చేతిలో ఉన్న ఫోన్‌ను  బలవంతంగా లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయిందని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తన మొబైల్ ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం, కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయని, ఫోన్ పోగొట్టుకోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నానని గౌతం తెలిపాడు. ఈ ఘటనపై దొంగతనం కేసు నమోదు చేయాలని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం సంబంధిత మహిళ బౌన్సర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ గౌతమ్ ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా దానికి సంబంధించిన సాక్ష్యా లను కూడా పంపించాడు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.
 

 

By
en-us Political News

  
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.