Publish Date:Nov 23, 2024
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు ఎంత భంగం కలిగించాలో అంతా కలిగించారు. తిరుమల కొండపై పారిశుద్ధ్యం అధ్వానంగా మార్చేశారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నాశనం చేశారు. కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే తిరుమలలో జగన్ హయాంలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని అరాచకాలూ జరిగాయి. అన్యమత ప్రచారం నుంచి మాంసం, మద్యం వినియోగం వరకూ అన్నీ జరిగాయి.
ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో పద్దతిలో అప్పట్లో టీటీడీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు విచారణలో ఆ విమర్శలన్నీ వాస్తవాలే అన్న విషయం వెలుగులోకి వస్తోంది. చివరాఖరికి లడ్డూ ప్రసాదం కూడా జగన్ హయాంలో అపవిత్రమైపోయింది. వైసీపీ అధికారంలో ఉండగా తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా తరాయైందని భక్తులు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే లడ్డూ ప్రసాదం నాణ్యత ఎందుకు నాసిరకంగా మారిపోయిందో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. జగన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ అధికారులు నాసిరకం, జంతు కొవ్వుతో కల్తీయిన నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారనీ, అందుకే ప్రసాదం నాణ్యత లేకుండా పోయిందనీ చంద్రబాబు కొద్ది కాలం కిందట ఒక సమావేశంలో వెల్లడించారు.
దీంతో దేశ వ్యాప్తంగా గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా ఉండటానికి కారణమైన వారినీ, ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడకానికి కారణమైన వారినీ, ఆ నెయ్యి సరఫరాదారులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ విషయంపై సుప్రీం కోర్టు సీబీఐ పర్యవేక్షణలతో స్వతంత్ర సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పుడా స్వతంత్ర సిట్ దర్యాప్తు ప్రారంభించింది.
శుక్రవారం (నవంబర్ 22) స్వతంత్ర సిట్ దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది. తిరుపతిలోని భూదేవీ కాంప్లెక్స్ లో సిట్ కోసం తత్కాలిక కార్యాలయం కూడా ఏర్పాటైంది. ఈ సిట్ బృందంలో నలుగురు డీఎస్పీలు నాలుగు బృందాలుగా ఏర్పడి తిరుపతి, తిరుమలలో దర్యాప్తు చేయనున్నారు. తమ దర్యాప్తు నివేదికను సీబీఐకు సమర్పిస్తారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరుకు పరిశీలించనున్నారు. అలాగే లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను కూడా సిట్ బృందం ప్రశ్నించ నుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ladduprasadam-adultration-continuation-of-attacks-on-temples-39-188868.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.