Publish Date:Sep 23, 2024
తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డూ అన్నా, దాని పవిత్రత అన్నా, దాని రుచి అన్నా మీకు ఎంతో ఇష్టం కదూ? తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాకుండా జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూ తయారీలో ఉపయోగించారని ఇటీవల వచ్చిన వార్తలు విని మీరు చాలా బాధపడే వుంటారు. తిరుమలలో ఎన్నో అవినీతి, అక్రమ కార్యకలాపాలు చేసిన ఈ దుర్మార్గులు చివరికి స్వామివారి లడ్డూని కూడా వదల్లేదా అని మీకు కోపం వచ్చింది కదూ! ఈ ఐదేళ్ళుగా ఎంతో భక్తిగా, ప్రేమగా స్వీకరించిన లడ్డూ ప్రసాదం వెనుక ఇంత కుట్ర జరిగిందని మీకు బాధకలిగే వుంటుంది. స్వామివారికి జరిగిన అపచారం మీకు తీవ్ర మనోవేదన కలిగించే వుంటుంది. అయితే, ఇక అలా బాధపడాల్సిన అవసరమే లేదండీ.. పరిస్థితితో మార్పు వచ్చింది. తిరుమల లడ్డూకి పవిత్రత మళ్ళీ సమకూరింది. తిరుమల లడ్డూ విషయంలో ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నేతిని మార్చింది. ఇప్పుడు శ్రీవారి లడ్డూని ఎలాంటి ఇబ్బంది లేకుండా, పవిత్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు గురికాకుండా మహాప్రసాదాన్ని హాయిగా స్వీకరించవచ్చు.
అలాగే శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా టీటీడీ అధికారులు శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఆలయంలోని అన్ని విభాగాల్లోనూ ప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా లడ్డూ తయారీ జరిగే పోటులో ప్రోక్షణ జరిగింది. స్వామివారికి మహా నైవేద్యం నిర్వహించారు. ఇక భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ ఈఓ శ్యామలరావు భరోసా ఇస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమ నిర్వహణతో అన్ని దోషాలూ తొలగుతాయని ఆయన వివరించారు. గతంలో వున్న నెయ్యి మొత్తాన్నీ తొలగించామని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/laddu-issue-chandrababu-25-185393.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.