కుక్కకు  డీఎన్‌ఏ టెస్ట్..  

Publish Date:Mar 20, 2021

Advertisement

ఆస్తుల కోసం అన్నదమ్ముల గొడవ పడడం వింటుంటాం. ఏదైనా వస్తువు కోసం గొడవ పడుతుంటారు. కానీ ఇద్దరు వ్యక్తులు ఒక కుక్క నాదంటే నాదంటూ గొడవ పడడం చూశారా.. చూసేవుంటారు కానీ ఈ కేసులో ఒక కొత్త కోణం ఉంది. అదేంటంటే...

గత  ఏడాది  ఆగస్టులో ఓ లాబ్రాడర్‌ జాతి కుక్క.. తమదేనంటూ  షాదాబ్‌ ఖాన్, కార్తీక్‌ శివహరేలు గొడవ పడ్డారు. విషయం పెరిగి  పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇద్దరు వ్యక్తులు కుక్క  ఫిర్యాదు ఇవ్వడంతో కుక్క ఎవరితో తేల్చలేక పోలీసులు తలలు బాదుకున్నారు. ఎంతగా విచారణ చేసినా, అసలు యజమానెవరో పోలీసులు తేల్చలేకపోయారు. చివరకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 

ఎక్కడైనా ఒక వ్యక్తి ఎవరికి జన్మించాడో, తన పుట్టుపూర్వోత్తరాలేంటో తెలుసుకోవడానికి  డీఎన్‌ఏ టెస్ట్ చేస్తారు. కానీ ఈ కేసులో కుక్క  యజమాని ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ పరీక్ష చేశారు.  టెస్ట్ తర్వాత   కుక్క యజమానిని తేల్చారు ‌ పోలీసులు. 

కుక్కను తాను పచ్‌మడీ ప్రాంతం నుంచి కొనుగోలు చేశానని షాదాబ్‌ తెలిపారు. దీంతో కుక్క నుంచి, కుక్క తల్లి నుంచి శాంపిళ్లను సేకరించి డిసెంబర్‌లో డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్‌ పంపారు. ఆ ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. కుక్క యజమాని షాదాబేనని తేలింది. డీఎన్‌ఏ పరీక్షల కోసం రూ.50 వేలు ఖర్చు పెట్టాను. చివరకు నా కుక్క నాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది అని షాదాబ్‌ ఖాన్‌ తెలిపారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ హోషంగాబాద్ లో జరిగింది. 

By
en-us Political News

  
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.