విశాఖ ఐకానిక్ క్యాపిటల్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు

Publish Date:Mar 31, 2025

Advertisement

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించి నానా హడావుడి చేసిన జగన్ సర్కారు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో తన నివాసం కోసం రుషికొండను తొలిచి ప్రజాధనంతో ఒక భారీ ప్యాలెస్ మాత్రం జగన్ కట్టించారు. దాన్ని ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో కూటమి సర్కారు ఉంది. మరో వైపు విశాఖను దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటూ కూటమి సర్కారు , విశాఖను ఒక బ్రాండ్‌గా మార్చే పనిలో పడింది.

 విశాఖను దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామనీ, విశాఖను ఒక బ్రాండ్‌గా మార్చుతామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల్లో తనకు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలలో స్థానాల్లో మూడవ స్థానం వచ్చినందుకు కొంచెం బాధనిపించిందనీ,  కానీ మొదటి రెండు అత్యధిక మెజారిటీ స్థానాలు విశాఖకు వచ్చాయన్నారు. దీన్ని బట్టి విశాఖ ప్రజలు తమపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారని అర్థమైందన్నారు. విశాఖను అభివృద్ధి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

 వరుణ్ గ్రూప్ నిర్మాణం చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు... భారతదేశంలోనే ఒక ఐకానిక్ ప్లేస్‌గా మిగులుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఐటీ పరంగా అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారన్నారు. చంద్రబాబును విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోకి నగరంలోకి రాకుండా అడ్డగించారన్నారు. విజయనగరం తీర్థాలు గుడికి వెళుతుంటే బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి రాకుండా చేయాలని చేశారని మండిపడ్డారు. లులు గ్రూప్ కూడా త్వరలో విశాఖకు వస్తుందన్నారు. గడిచిన 10 నెలల్లోనే విశాఖకు టీసీఎస్, మెటల్ ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్ వంటి సంస్ధలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా తీసుకున్నామని చెప్పారు. 

మన ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు.. స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ చేయమంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోనే ట్రిలియన్ డాలర్ ఎకానమీని తీసుకొస్తామని గర్వంగా చెప్తుతున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలని... 9 నెంబర్లలో లార్జెస్ట్ ఎకనామికల్ సిటీగా ఉన్న విశాఖను పదోవ స్థానానికి దించారని విమర్శలు గుప్పించారు. ఎంపీ భరత్, విశాఖ శాసనసభ్యులపై దృష్టి సారించి విశాఖను 5వ లార్జెస్ట్ ఎకనామికల్ సిటీగా నిలబెడతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఐటీ డెస్టినేషన్‌గా మారుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని... ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా పూర్తయిందని వెల్లడించారు. విశాఖ అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అనువైన ప్రాంతమన్నారు. హోటల్స్, కాన్సెర్ట్స్, క్రికెట్ మ్యాచ్ లు జరిగే వైబ్రెంట్ సిటీ విశాఖపట్నం అని తెలిపారు.

అమరావతి భవనాల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.  ఇప్పుడు వరుణ్ గ్రూప్ చేపడుతున్న హోటల్  రెండేళ్లలోనే పూర్తి చేస్తారని నమ్మకం ఉందన్నారు. 2027 మార్చి 31 లోపు వరుణ్ గ్రూప్ చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్‌ను పూర్తి చేయాలన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సంవత్సరంలోపు ప్రారంభం చేస్తామన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు కన్నా ముందే... భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.